హలో శ్రీరెడ్డి.. నాని సంగతేమైంది?

శ్రీరెడ్డి ఈ పేరు ఈమద్య తెలుగు సినిమా పరిశ్రమలో మరియు మీడియాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఈమె ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యింది.

 Sri Reddy Tweets About Nani-TeluguStop.com

సినిమాల్లో నటించకుండానే ఈమెను అందరు గుర్తించేలా పేరు తెచ్చుకుంది.శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమం ప్రారంభించి శేఖర్‌ కమ్ముల, నాని, వైవాహర్ష, అభిరామ్‌, శ్రీరామ చంద్రలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టి ఈమెపై పడటం జరిగింది.

అయితే ఈమె ఏ పని చేసినా ఆరంభ సూరత్వం అన్నట్లుగానే ఉంది.ప్రతి విషయం కూడా ప్రకటిస్తూ ఉంది, రెండు మూడు రోజులు హడావుడి చేసి మళ్లీ కామ్‌ అవుతుంది.

మళ్లీ కొత్త విషయంతో మీడియా ముందుకు వచ్చింది.

ఆ మద్య కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ఉద్యమం చేసిన శ్రీరెడ్డి, ఆ తర్వాత అభిరామ్‌ విషయంలో తనకు న్యాయం చేయాలని వ్యక్తిగత పోరాటం చేసింది.ఆ తర్వాత పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి, ఆ వ్యాఖ్యలకు సారీ కూడా చెప్పింది.అటు పిమ్మట రాజకీయ పార్టీలపై విమర్శలు చేసింది.

ఇంకా పలు విషయాలపై ఈమె స్పందిస్తూ, తన వాదన వినిపిస్తూ వచ్చింది.కాని ఒక్క విషయంలో కూడా ఈమె నిలకడగా వ్యవహరించడం లేదు.

ఇటీవలే ఈమె నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఒక అమ్మాయికి రోజంతా కూడా నరకం చూపించిన నీకు త్వరలోనే చుక్కలు చూపిస్తాను అంటూ హెచ్చరించింది.

నీ టోకేన్‌ నెంబర్‌ వచ్చిందిరా నాని అంటూ సంచలన ట్వీట్‌ చేసిన శ్రీరెడ్డి ఆ విషయాన్ని మర్చి పోయినట్లుగా ఉంది.ఆ ట్వీట్‌ చేసి వారం దాటుతున్నా ఇప్పటి వరకు దానికి కొనసాగింపు చేయలేదు.

త్వరలోనే నాని బండారం బయట పెడతాను అంటూ హెచ్చరించిన శ్రీరెడ్డి ఆ విషయంలో మళ్లీ స్పందించలేదు.మళ్లీ ఆమెకు గుర్తుకు వచ్చినప్పుడు మరో ట్వీట్‌ చేస్తుందేమో అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమే అంటూ కొందరు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంను సూటిగా చెప్పకుండా పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశ్యంతో దాస్తూ, మూస్తూ చెబుతూ వస్తుందని కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

నాని వల్ల ఇబ్బంది పడ్డ ఆ మహిళ ఎవరు, నాని చేసిన తపు ఏంటీ అనే విషయాన్ని వెంటనే శ్రీరెడ్డి తేల్చి చెప్పాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.మరి కొందరు మాత్రం అసలు శ్రీరెడ్డి ఆరోపించినట్లుగా నాని ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె పబ్లిసిటీ కోసం అలాంటి పాడు వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.

మరి శ్రీరెడ్డి ఇప్పటికైన నాని విషయంలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube