జగన్ విషయంలో నోరుజారిన శ్రీరెడ్డి..! అలా ట్వీట్ చేసినందుకు ఓ రేంజ్ లో నెటిజెన్ల కౌంటర్లు.!   Sri Reddy Tweet Over Ys Jagan Attack     2018-10-28   10:15:30  IST  Sainath G

వైజాగ్ విమానాశ్రయంలో నిన్న జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. జగన్ ఈ రోజు హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జగన్ కు ఐదు రోజుల పాటు విశ్రాంతి అవసరమని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి జరగడంపై పలువురు నేతలు, సెలబ్రిటీలు ఖండించారు.

ఇది ఇలా ఉంటె…ఈ దాడిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా స్పందించారు…కాకపోతే ఆమె చేసిన ట్వీట్ కాస్తా రివర్స్ కావడంతో నెటిజన్లు శ్రీరెడ్డిపై కౌంటర్ లు వేస్తున్నారు. జగన్ పై నిన్న జరిగిన దాడిపై శ్రీరెడ్డి స్పందిస్తూ..

“మా జగన్ అన్నకు ఏం అయింది. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్షాలు దాడులు చేయడం ఏంటి? దమ్ముంటే జగన్ ను ధైర్యంగా ఎదుర్కొనాలి. అంతేకానీ జనం కోసం పోరాడుతున్న జగన్ పై ఇలాంటి దాడులు చేయడం తప్పు. జగనన్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా” అని ట్వీట్ చేసింది.

Sri Reddy Tweet Over Ys Jagan Attack-

ఇది చూసిన నెటిజన్లు.. జగన్ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగానే ఉన్నారనీ, అంతమాత్రం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ‘జగన్ ఏపీలో ప్రతిపక్షమే, టీడీపీ వాళ్లు డబ్బులిచ్చి ప్రతిపక్షాలు అని చెప్పమన్నారా? బుర్ర తక్కువదానా’ అంటూ మండిపడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలు ఎవరో కూడా తెలియని స్థితిలో శ్రీరెడ్డి ఉందనీ, ఆమెను అలా వదిలేయాలని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ట్వీట్ కనిపించడం లేదు. బహుశా విమర్శలు రావడంతో ట్వీట్ డిలీట్ చేసినట్టు ఉంది. జగన్ అన్నా నువ్వు తొందరగా కోలుకోవాలి అని పోస్ట్ పెట్టింది.