పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటున్న శ్రీరెడ్డి ?  

Sri Reddy To Join Politics - Telugu Sri Reddy Political Entry Politics Udayanidi Maran Tamilnadu Andrapradesh Janasena Pavan Kalyan Vairal News

శ్రీ రెడ్డి ఇది పేరు కాదు సంచలనాలకు మారుపేరు.సెలెబ్రెటీలంతా ఈమె పేరు చెప్పగానే ఉలిక్కిపడుతుంటారు.

Sri Reddy To Join Politics

ఆమె ఎవరిమీదనైనా ఆరోపణలు చేస్తే ఆషామాషీగా ఉండదు.రచ్చ రచ్చ చేస్తూ వారి పరువు కాస్తా గంగలో మునిగేదాకాకా వదిలిపెట్టదు.

ఈమె బారినపడి ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు విలవిలలాడారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ అప్పుడప్పుడూ పోస్ట్లు పెడుతూ కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకుంది.

పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటున్న శ్రీరెడ్డి -General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈమె చెన్నై కి మకాం మార్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె తమిళ హీరో, స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయనిధి స్టాలిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన ఓ పోస్ట్ పెట్టారు.

హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉదయనిధి స్టాలిన్ తనతో ఏకాంతంగా గడిపాడంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.దీంతో చెన్నైలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ తాను అసలు ఉదయనిధిని డైరెక్టుగా కూడా చూడలేదని, తన పేరుతో నకిలీ అకౌంట్‌ నుంచి ఈ పోస్టు విడుదలైందని చెప్పుకొచ్చింది.

అలాగే అతి తొందర్లోనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కూడా శ్రీ రెడ్డి ప్రకటించి సంచలనం రేపింది.ఇంతకీ ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోయేది తమిళనాడులోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి అట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test