'నీ సైజ్ కూడా తెలుసు...టాప్ హీరోగా ఉంటూ అందర్నీ మోసం చేస్తున్నావు' శ్రీరెడ్డి సంచలన పోస్ట్.!   Sri Reddy Targets Tamil Big Hero     2018-10-29   08:40:05  IST  Sainath G

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి. ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఒక వైపు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ ఇలా అందరిని షేక్ చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా మరో పెద్ద తలకాయపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నేరుగా పేరు చెప్పకుండా అందరికి అర్థం అయ్యేలా శ్రీరెడ్డి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో.. నడిగర్ సంఘం – తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నీవు హీరోయిన్స్ తో పాటు సైడ్ యాక్టర్స్ ను కూడా ఎంతగా వేదిస్తావో నాకు తెలుసు. మీడియా ముందు మిస్టర్ పర్ ఫెక్ట్ గా మాట్లాడే నీవు ఎలాంటి వాడివో త్వరలోనే నిరూపిస్తాను. నువ్వు ఈరోజు మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే నువ్వు ఎంత ఫేక్ పర్ఫెక్ట్ అనే విషయం అర్థం అయ్యింది. నీవు వేసుకునే సైజు – నీ కలర్ అన్ని నాకు తెలుసు. మీడియా ముందు – కోర్టు ముందు నీ భాగోతంను పక్కా ఆధారాలతో బయట పెడతాను. నువ్వు ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశావు. వారిని బలవంతంగా వాడుకుని ఆ తర్వాత వారికి డబ్బులు ఇస్తావు. అందుకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ నిర్మాతల వద్ద ఎంత భారీగా వసూళ్లు చేస్తున్నావో నాకు కొందరు చెబితే తెలిసింది. నువ్వో పెద్ద బ్లాక్ మెయిలర్ వి. నీ జీవితానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నిర్మాతల మండలిలో నీ అధికారాలను దుర్వినియోగం చేసి బాగా డబ్బు సంపాదించావు.

Sri Reddy Targets Tamil Big Hero-

ఎమ్మెల్యే సీటు – హీరో క్రేజ్ – నిర్మాత హోదా అన్నీ కూడా కొట్టుకు పోయే రోజు వస్తుందని శ్రీరెడ్డి పేర్కొంది. శ్రీరెడ్డి ఇంతగా రెచ్చి పోయి వ్యాఖ్యలు చేసిన హీరో తెలుగులో కూడా గుర్తింపు ఉన్న హీరో. నిజంగానే శ్రీరెడ్డి అన్నట్లుగా ఆ హీరోపై చేసిన ఆరోపణలను నిరూపించనుందా చూడాలి.