శ్రీరెడ్డి ఈసారి రాజేంద్ర ప్రసాద్‌ను టార్గెట్‌ చేసింది  

Sri Reddy Targets Rajendra Prasad-

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌పై చిన్న స్థాయి యుద్దం చేసిన శ్రీరెడ్డి ఎంతో మంది స్టార్స్‌ పరువు తీయడంతో పాటు, వారిని రోడ్డు మీదుకు తీసుకు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చింది. తెలుగు స్టార్స్‌పై మాత్రమే కాకుండా తమిళ స్టార్స్‌ పై కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ స్టార్స్‌ను మరింతగా విమర్శించకుండా అక్కడి వారు ఈమెకు సినిమాల్లో ఆఫర్స్‌ ఇచ్చారు..

శ్రీరెడ్డి ఈసారి రాజేంద్ర ప్రసాద్‌ను టార్గెట్‌ చేసింది-Sri Reddy Targets Rajendra Prasad

తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు స్టార్స్‌ను టార్గెట్‌ చేస్తూనే ఉంది.

గుర్తుకు వచ్చినప్పుడల్లా తెలుగు సినిమా ప్రముఖులను టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజేంద్ర ప్రసాద్‌ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంను రేపుతున్నాయి. ఈమె చేసిన ఆరోపణలతో రాజేంద్ర ప్రసాద్‌ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇంతకు శ్రీరెడ్డి ఏమన్నదంటే. మా అసోషియేషన్‌ నుండి నువ్వు 6 నెలల్లో ఎందుకు బయటకు వచ్చావో అందరికి తెలుసు, నీతో నటించిన హీరోయిన్‌ మాళవిక ఎందుకు అంత త్వరగా తెలుగు సినిమా పరిశ్రమను వదిలేసి పోయిందో అందరికి తెలుసు, నీ లైంగిక వాంచ కోసం ఎంతో మంది హీరోయిన్స్‌ను ఇరిటేట్‌ చేశావు. నీతో హేమ ఎందుకు ఇప్పటికి గొడవ పడుతుందో అందరికి కూడా తెలుసు అంటూ విమర్శించింది.

నీ కూతురు ఇంటి నుండి వెళ్లి పోయింది అంటే అది నీ పాపమే అంటూ వ్యక్తిగతంగా కూడా శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

రాజేంద్ర ప్రసాద్‌ రీసెంట్‌గా బేవర్స్‌ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కాస్త ఎమోషనల్‌ అయ్యి, తన వ్యక్తిగతం గురించి మాట్లాడాడు. రాజేంద్ర ప్రసాద్‌ మంచి వ్యక్తి అనుకుంటున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికి షాకింగ్‌గా అనిపిస్తుంది.