రాపాక మీరు కేక అంటున్న శ్రీ రెడ్డి...  

Sri Reddy Support To The Janasena Mla Rapaka Vara Prasad-mla Rapaka Vara Prasad,sri Reddy,sri Reddy And Rapaka Vara Prasad,sri Reddy Latest News,sri Reddy News

గత కొద్దికాలంగా శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని బాగానే టార్గెట్ చేస్తోంది.అయితే ఇందులో కొంచెం ఎక్కువ శ్రద్ధ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

Sri Reddy Support To The Janasena Mla Rapaka Vara Prasad-Mla Prasad Sri And Latest News

అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసి అనుకోకుండా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.అయితే జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని చోట్లా ఓడిపోయి కేవలం కోనసీమ ప్రాంతమైనటువంటి రాజోలులో మాత్రం రాపాక వరప్రసాద్  రావు గెలవడం కొంత ఆ పార్టీకి ఊరట కలిగించింది.

అయితే ప్రస్తుతం రాపాక వరప్రసాదరావు చేసేటువంటి పనులు జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

అంతేగాక ఎమ్మెల్యే రాపాక ఒకపక్క ప్రజాసమస్యల పై పోరాడుతూనే మరోపక్క క అధికార పక్షం అయినటువంటి వైఎస్సార్సీపీ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాడు.

ఈ వైఖరి జనసేన పార్టీలోని పలువురు పెద్దలకి రుచించడం లేదు.అయితే తాజాగా అసెంబ్లీలో వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుకి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన మద్దతు తెలియజేశాడు.అంతేకాకుండా తన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కూడా లేఖ రాశాడు.

అయితే ఈ విషయంపై తాజాగా శ్రీరెడ్డి స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది.శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ రాపాక మీరు కేక అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి పవన్ కళ్యాణ్ తో విభేదిస్తునే వస్తున్నాడు.

అయితే ఇక్కడ శ్రీ రెడ్డి కూడా గత కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడుతోంది.అందువల్లనే ప్రస్తుతం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతు పలికిన టువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కి మద్దతుగా తన ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Sri Reddy Support To The Janasena Mla Rapaka Vara Prasad-mla Rapaka Vara Prasad,sri Reddy,sri Reddy And Rapaka Vara Prasad,sri Reddy Latest News,sri Reddy News Related....