టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎవరో ఒక ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు.అయితే ఈమె ఒకప్పుడు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఉద్యమం నడిపి మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి టాలీవుడ్ సినీ పరిశ్రమకు కొంతకాలం బహిష్కరణకు గురైంది.
అయితే బహిష్కరణకు గురైన తర్వాత ఈమె తన మకాం చెన్నైకి మార్చింది.మకాం అయితే చెన్నైకి మార్చింది కానీ తెలుగు సినీ పరిశ్రమ మాత్రం శ్రీరెడ్డి వదల్లేక పోతోంది.
ఇందులో భాగంగానే సినీ పరిశ్రమలోని పెద్దలు టార్గెట్గా చేసుకుని వారిపై తీవ్ర విమర్శలు వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి ఫోకస్ మొత్తం మెగా ఫ్యామిలీ పైనే ఉంటోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పై పలు ఘాటు వ్యాఖ్యలు చేసి సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ అమ్మడు మరో మెగాహీరో అయినటువంటి అల్లు అర్జున్ ని టార్గెట్ చేసింది.
బన్నీని టార్గెట్ గా చేసుకొని అతడి హెయిర్ స్టైల్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.అల్లు అర్జునా ఇప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్ తో సినిమాలో వస్తావా లేక ఎప్పుడు ఎక్స్టెన్షన్ విగ్గులు దర్శిస్తుంటావా.? అంటూ సోషల్ మీడియా సామాజిక మాధ్యమం అయినటువంటి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేసింది.
దీంతో బన్నీ ఫాన్స్ ఈ విషయంపై అనూహ్య రీతిలో స్పందిస్తున్నారు.ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు న టార్గెట్ చేస్తూ ఉంటావు నీకేం పని లేదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకూ శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీలో హీరోలని టార్గెట్ చేస్తూ పలు తీవ్ర విమర్శలు ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇప్పటివరకు ఒక్క మెగా హీరో కూడా వీటిపై స్పందించలేదు.
దీంతో శ్రీ రెడ్డి రోజు రోజుకి మెగాఫ్యామిలీపై మరింత విరుచుకు పడుతోంది.