పవన్‌, త్రివిక్రమ్‌లు పార్వతి మెల్టన్‌ జీవితాన్ని నాశనం చేశారు : శ్రీరెడ్డి  

Sri Reddy Slams Pawan Kalyan And Trivikram Over Parvathi Melton-parvathi Melton Life,pawan Kalyan,sri Reddy,trivikram

శ్రీరెడ్డి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె ఏ స్థాయిలో టాలీవుడ్‌ స్టార్స్‌పై ట్రోల్స్‌ చేస్తుందో తెలిసిందే. నాని మరియు అభిరామ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఈసారి పవన్‌ కళ్యాణ్‌ మరియు త్రివిక్రమ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది...

పవన్‌, త్రివిక్రమ్‌లు పార్వతి మెల్టన్‌ జీవితాన్ని నాశనం చేశారు : శ్రీరెడ్డి-Sri Reddy Slams Pawan Kalyan And Trivikram Over Parvathi Melton

చాలా కాలం క్రితం పవన్‌ మరియు త్రివిక్రమ్‌ ద్వయంపై పూనం కౌర్‌ సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. వారిద్దరు పూనంను వాడుకున్నారు అనే టాక్‌ పెద్ద ఎత్తున ఉంది. అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే లేదు.

కాని తాజాగా శ్రీరెడ్డి ఆ విషయంపై స్పందించి మరోసారి చర్చనీయాంశం చేసింది.

పవన్‌ కళ్యాణ్‌ ను పూనం చాలా ప్రేమించింది, ఆయనతో సహజీవనం సాగించేందుకు కూడా ఆసక్తి చూపించింది. పవన్‌ నో చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసింది.

అయినా కూడా పవన్‌ ఆమెపై ఆసక్తి చూపలేదు అనేది చాలా మంది వాదన. అయితే శ్రీరెడ్డి మాత్రం పవన్‌ మరియు త్రివిక్రమ్‌లు దారుణంగా పూనంను వాడుకున్నారు అంటూ ఆరోపించింది. జల్సా సమయంలో పూనం కౌర్‌తో పాటు మరో హీరోయిన్‌గా నటించిన పార్వతి మెల్టన్‌తో కూడా వారిద్దరు ఆడుకున్నారు అంటూ ఆరోపించింది.

పార్వతి మెల్టన్‌ను త్రివిక్రమ్‌ మోసం చేశాడని, పార్వతి మెల్టన్‌కు కడుపు వచ్చేలా త్రివిక్రమ్‌ చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది. ఆమె గర్బం తీయించి ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ నుండి పోయేలా చేశారు. ఆమెకు వచ్చే ఆఫర్లు రాకుండా త్రివిక్రమ్‌ చేశాడు అంటూ శ్రీరెడ్డి సంచలన విషయాలను చెప్పింది. ఇప్పటి వరకు రాని పార్వతి మెల్టన్‌ పేరు ఇప్పుడు రావడంతో అంతా కూడా ఆశ్చర్య పోతున్నారు.

నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.