లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..! ఎన్టీఆర్ విషయంలో ఎవరూ ఆమెను ఈ విషయం అడగలేదా?

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే.శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి.

 Sri Reddy Sensational Comments On Lakshmi Parvathi-TeluguStop.com

కొన్ని రోజులు ఇక్కడ ఉంది మన ఇండస్ట్రీ పై ఫైర్ అయిన తర్వాత శ్రీరెడ్డి తమిళనాడు వెళ్లి అక్కడి ఇండస్ట్రీపై ఫైర్ అవుతుంది.ఇప్పుడు తాజాగా లక్ష్మీ పార్వతిపై తనదైన శైలిలో పంచ్‌లు వేసింది.

అంతేకాదు త్వరలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించబోతున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా చేస్తున్నట్టు వెల్లడించింది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి స్పందిస్తూ… ఎవరిలో అయినా నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి.

ఎవరికి వారు తాము మంచివారం అనే ఫీలింగులో ఉంటారు.వారు చేసే ఏ పని కూడా పాపపు పని అనుకోరు.

లక్ష్మి పార్వతిగారు కూడా ఆవిడవైపు నుంచి మంచి అనేలా సినిమా చేయించుకుంటున్నారు.మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం.

లక్ష్మీ పార్వతిలోని నెగిటివ్ కోణం చూపించాలనుకుంటున్నారు.ఒక నటిగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

నేను నటిని.నాకు తప్పొప్పులతో సంబంధం లేదు.

బాలయ్యగారు తాను చేస్తున్న సినిమా గురించి ఒకటే చెప్పారు.మా నాన్నగారిని మా యాంగిల్ లో ఎలా చూశామో, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది సినిమా రూపంలో చూపించాలను కుంటున్నట్లు తెలిపారు.కొన్ని విషయాలు టచ్ చేయడం లేదని క్లియర్‌గా చెప్పారు.

ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఆవిడ కోణంలో రైట్ అనిపించువచ్చు.

అది నిజం కావచ్చు.కాకపోవచ్చు కూడా.

రామ్ గోపాల్ వర్మ ఫేమస్ అయినంత మాత్రాన ఆయన ఏది చూపిస్తే అది జనం నమ్ముతారా ? లేదా చూడాలి.

ఎన్టీఆర్ గారు 1923లో జన్మించారు.

వీరగందం సుబ్బారావుగారు 1937లో పుట్టారు.లక్ష్మి పార్వతిగారు ఏమైనా అంటే.

ఆయనకు నాకు పదిహేడేళ్లు తేడా, నేను హ్యాపీగా ఉండలేక పోయాను, కాపురం చేయలేక పోయాను అంటారు.మరి ఎన్టీఆర్ విషయంలో ఎవరూ ఆమెను ఈ విషయం అడగలేదా?

వీరగ్రంథం సుబ్బారావు కంటే ఎన్టీఆర్ వయసులో చాలా పెద్దవారు.అంతకన్నా ఎక్కువ ఏజ్ ఎక్కువున్న వ్యక్తితో మీకు ఎన్ని విభేదాలు రావాలి ? ఆయనకు భార్య లేదు.ఒంటరివాడైనందకు వండి పెట్టాను.

దగ్గరుండి చూసుకున్నాను,ప్రేమించాను అని లక్ష్మీ పార్వతి ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు.మరి మీ ఆయన్ని నువ్వు ఒదిలేసినపుడు మీ ఆయన ఒంటరి కాలేదా ? 16 ఏళ్ల కొడుకును ఒదిలేసి వచ్చినపుడు ఆ పిల్లాడు ఒంటరి వాడు కాదా ? నువ్వు ఏ విధంగా సరైన భార్య? ఏ విధంగా సరైన తల్లివి? ఈ నెగెటివ్ షేడ్స్ కేతిరెడ్డిగారు చూపించబోతున్నారని శ్రీరెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube