హీరో విశాల్ ని రాయలేని భాషలో బూతులు తిట్టిన శ్రీ రెడ్డి  

విశాల్ ని బూతులు తిట్టిన శ్రీ రెడ్డి. .

Sri Reddy Sensation Comments On Hero Vishal-kollywood,sri Reddy Sensation Comments,telugu Cinema,tollywood

తెలుగు తమిళ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్టింగ్ కౌచ్ ఉదంతంలో సెంటర్ పాయింట్ గా నిలబడి టాలీవుడ్ ని రోడ్డుమీదకి తీసుకొచ్చిన ఈ భామ తర్వాత పవన్ కళ్యాణ్ మీద చెప్పాలేని భాషలో వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. తర్వాత కూడా ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం అలాగే హీరోల మీద కూడా కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది..

హీరో విశాల్ ని రాయలేని భాషలో బూతులు తిట్టిన శ్రీ రెడ్డి-Sri Reddy Sensation Comments On Hero Vishal

ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ని టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా రాయలేని భాషలో అతన్ని బూతులు తిట్టి విరుచుకు పడింది. హీరోయిన్స్ తో కమిట్ మెంట్ తీసుకోకుండా విశాల్ అసలు సినిమానే చేయడని శ్రీరెడ్డి ఆరోపించింది.

ఇక విశాల్ కేరవాన్ కి అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తి తనకు తెలుసని వెల్లడించింది. విశాల్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని అతని వల్ల నాశనమైన ముగ్గురు బాధితులు తనకు తెలుసని చెప్పుకొచ్చింది. తన జోలికి వస్తే కాళీమాత అవతారమెత్తి అంతు చూస్తానంటూ ఏకంగా బెదిరించింది.

ఇప్పుడు ఆమె వాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. విశాల్ ని ఇంత దారుణంగా విమర్శించడంపై కొంతమంది నేరుగా కామెంట్స్ తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయినా కూడా ఆమె మాటల్లో మాత్రం ఎలాంటి పదును తగ్గడం లేదని తెలుస్తుంది.