చికాగో సెక్స్ రాకెట్ లో కొత్త ట్విస్ట్..! 36 మంది పేర్లను ఫేస్బుక్ లో బయటపెట్టిన శ్రీరెడ్డి       2018-06-23   21:38:49  IST  Raghu V

గత వరం రోజులనుండి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ చికాగో సెక్స్ రాకెట్. అమెరికాలో తీగ లాగితే టాలీవుడ్ డొంకంతా కదులుతోంది. అయితే ఇప్పటికే సెక్స్ రాకెట్ వివాదంలో 10 మందికి పైగా పాపులర్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సెక్స్ రాకెట్ వివాదం హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో వివాదాస్పద నటి “శ్రీరెడ్డి” ఈ విషయంపై స్పందించారు.

36 మందితో కూడిన లిస్ట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాకుండా ఇంకా చాలా మంది సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ఉన్నారంటూ పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి లీక్ చేసిన లిస్ట్‌లో మంది పాపులర్ హీరోయిన్స్, యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లతో పాటు పురుషులు కూడా ఉండటం విశేషం.

-

ఫేస్ బుక్‌ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘అమెరికా సెక్స్ రాకెట్‌ విషయంలో అక్కడ పోలీసులకు నా సహకారం అందించాను. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేను ఈ పేర్లు బయట పెట్టడం వల్ల నన్ను ఎవరైనా ఏదైనా చేయొచ్చు అయినా నాకు భయంలేదు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లు.. వాళ్లను ఉంచుకున్న పొలిటికల్ లీడర్స్ నన్ను చేయొచ్చని వెనకడుగు వేసేదాన్నైతే ఇలా మీ ముందుకు వచ్చే దాన్ని కాదు.

-

సెక్స్ రాకెట్ ప్రధాన సూత్రధారి శ్రీరాజ్ అలియాస్ కిషన్ మోదుగు మూడితో తమకు ఎలాంటి సంబధం లేదని అసలు ఆయనెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా మూర్ఖత్వం. శ్రీరాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద కోఆర్డినేటర్స్, మేనేజర్‌లు టచ్‌లో ఉన్నారు. వాళ్లు కోఆర్డినేట్ చేస్తేనే హీరోయిన్లు, మిగతా నటీ నటులు అప్రోజ్ అవుతున్నారు. శ్రీరాజ్‌కి పలువురు హీరోయిన్లు, హీరోలు, దర్శకులు, ప్రొడ్యుసర్లు టచ్‌లో ఉన్నారు.

-

,