తన ఆస్తుల వెనుక గుట్టు విప్పిన శ్రీరెడ్డి       2018-04-30   01:21:15  IST  Raghu V

గత కొన్ని వారాలుగా సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న అంశం శ్రీరెడ్డి. సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇలా అన్ని మీడియాల్లో కూడా శ్రీరెడ్డి పేరు మారు మ్రోగి పోతుంది. కాస్టింగ్‌ కౌచ్‌పై యుద్దం ప్రకటించిన ఈమె ఆ మద్య ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు అర్థనగ్న ప్రదర్శణ చేయడంతో సంచలనంగా మారిపోయింది. ఆ తర్వాత సురేష్‌బాబు తనయుడుతో పాటు పలువురు సినీ ప్రముఖుల లీలలు బయట పెట్టడంతో పాటు పవన్‌పై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ అమ్మడు మోస్ట్‌ పాపులర్‌ అయ్యింది. ఈమె ఎంతో మంది లీక్‌లు బయట పెడుతున్న సమయంలోనే ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.

శ్రీరెడ్డికి వ్యతిరేకంగా కరాటే కళ్యాణి కొన్ని సాక్ష్యాధారాలను సాధించింది. ఈమె తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందనే మాట వాస్తవం కాదని, ఆమె కొన్నాళ్ల క్రితం ఒక ఖరీదైన ఫ్లాటు గృహ ప్రవేశం చేసింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆమె వెంటే ఉన్నారని, అలాగే ఆమె ఖరీదైన కార్లను కూడా కొన్నట్లుగా ఆమె నిరూపించింది. చాలా విలాసవంతమైన జీవితంను గడుపుతున్న శ్రీరెడ్డికి అంతగా డబ్బు ఎక్కడ నుండి వస్తుందని, ఆమెకు ఎవరు ఆర్థిక సాయం చేస్తున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే శ్రీరెడ్డి తన ఆస్తుల వెనుక ఉన్న రహస్యంను తెలియజేసింది.

తాను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యిందని, అప్పటి నుండి చిన్నా చితకా పాత్రలు చేస్తూ చాలా కాలం క్రితమే విజయవాడలో ల్యాండ్స్‌ కొన్నాను అని, ఆ ల్యాంగ్స్‌కు బాగా డిమాండ్‌ రావడంతో తనకు లాభాలు వచ్చాయని, ఆ కారణం వల్లే హైదరాబాద్‌లో ఖరీదైన ఫ్లాట్‌ను కొనుక్కోగలిగాను అని, అంతే తప్ప తాను ఏ తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించలేదు అంటూ చెప్పుకొచ్చింది. తప్పుడు పనులు చేస్తూ తప్పుగా ప్రవర్తిస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచన తనకు లేదు అంటూ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సమయంలోనే తనపై వస్తున్న మరిన్ని విమర్శలకు సమాధానం చెప్పింది.

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ఈమె ప్రారంభించిన ఉద్యమం మంచి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్న సమయంలోనే ఈమె చేసిన కొన్ని అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఉద్యమం నీరు కారిపోయినట్లయ్యింది. తమన్నా అనే ట్రాన్స్‌ జెండర్‌ను నమ్మి తాను పూర్తిగా మోసపోయాను అని, ఎంతో నమ్మి ఆమెతో ఉద్యమం చేయాలనుకున్నాను. కాని ఆమె మాత్రం తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి ఒకానొక దశలో దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆ విమర్శలను శ్రీరెడ్డి ఆపేస్తున్నట్లుగా ప్రకటించి, ఇకపై వ్యక్తిగత విమర్శలు చేయను అంటూ ప్రకటించింది.