శ్రీరెడ్డి పోస్ట్‌ చేసిన ఆ వీడియో చూసి మెగా ఫ్యాన్స్‌ ఆమెను చంపేయాలన్నంత కోపంతో రగిలిపోతున్నారు  

Sri Reddy Released A Video About Nagababu And Pawan Kalyan-balakrishns,pawan Kalyan,sri Reddy,sri Reddy About Mega Family,sri Reddy Leaks,srireddy About Nagababu,verrodi Veera Gadha

In the wake of Nagababu's release of videos on the one hand Balakrishna, Sreededi has released the videos in support of Balagya as a counter for Nagababu comments.

.

Sride Reddy once again got ready to play Mega, and once again on Mega Brothers and Mega Fans. Pawan and Naga Babu have made sensational comments on Balakrishna's criticism of Nagababu. . .

ఒక వైపు బాలకృష్ణపై నాగబాబు వరుసగా కామెంట్స్‌ చేస్తూ వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో అదే సమయంలో నాగబాబు కామెంట్స్‌కు కౌంటర్‌గా బాలయ్యకు మద్దతుగా శ్రీరెడ్డి విచ్చలవిడిగా వీడియోలు విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. .

శ్రీరెడ్డి పోస్ట్‌ చేసిన ఆ వీడియో చూసి మెగా ఫ్యాన్స్‌ ఆమెను చంపేయాలన్నంత కోపంతో రగిలిపోతున్నారు-Sri Reddy Released A Video About Nagababu And Pawan Kalyan

సందు దొరికితే చాలు మెగా వారిని వాయించేందుకు సిద్దంగా ఉండే శ్రీరెడ్డి మరోసారి మెగా బ్రదర్స్‌పై మరియు మెగా ఫ్యాన్స్‌పై రెచ్చి పోయింది. బాలకృష్ణపై నాగబాబు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ పవన్‌ మరియు నాగబాబులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ… నాగబాబుకు ఇప్పుడు బాలయ్యగారి వ్యాఖ్యలపై కోపం వచ్చిందా. గతంలో మీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కాంగ్రెస్‌ నాయకులపై మరియు చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలకు మీ సమాధానం ఏంటీ, పది మంది బచ్చాగాళ్లను వెంట వేసుకుని తిరిగే మీ తమ్ముడు గొప్ప నీతిమంతుడు అనుకుంటున్నావా, పార్టీని పెట్టి అమ్ముకున్న జాతి మీది, మీరు బాలకృష్ణ, ఆయన వంశం గురించి మాట్లాడుతున్నారా, అసలు మీకు నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు ఉంది.

నందమూరి ఫ్యామిలీలో ఉన్న గొప్పదనం, మంచితనం మీలో ఎవరికైనా ఉందా అంటూ శ్రీరెడ్డి దుమ్మెత్తి పోసింది.

పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఫిల్మ్‌ ఛాంబర్‌లోకి వెళ్లి తలుపు వేసుకోవడంపై శ్రీరెడ్డి స్పందించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఏమైనా నీ బాబు సొత్తా, అది ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరి సొత్తు.

దాంట్లోకి వెళ్లి తాళం వేసుకోవడానికి నువ్వు ఎవడివి, నీకు నీతి నిజాయితీ లేదు కాని ఇతరులు బాగుండాలని సోది చెప్తున్నావంటూ పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు రాష్ట్రం భవిష్యత్తు, ఆడవారుఇ స్వేచ్చ గురించి మాట్లాడుతున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మాటల యుద్దం చేస్తున్నారు.

ఆమె కనిపిస్తే కొట్టేంత కోపంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంది, అక్కడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మద్యలో ఇలా మెగా ఫ్యామిలీపై కౌంటర్స్‌ వేస్తోంది.