ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్థ నగ్నంగా నిరసన తెలియజేసినటువంటి నటి శ్రీ రెడ్డి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈమె అప్పట్లో టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పలు వ్యక్తిగత విమర్శలు చేయడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.
అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేటువంటి వారికి చాలా ఘాటుగా సమాధానం ఇస్తోంది శ్రీ రెడ్డి.
తాజాగా తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
అయితే ఇందులో స్వేచ్ఛ పేరుతో అమ్మానాన్నలను గాలికి వదిలి పెట్టి డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని వదిలేసినటువంటి అమ్మాయి ఒక వేశ్యతో సమానం అంటూ ట్వీట్ చేసింది.దీంతో శ్రీ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
అయితే ఇందులో పూనమ్ కౌర్ సినీ పరిశ్రమలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి ఓ వ్యక్తితో గర్భం దాల్చినందుకుగాను కోట్ల రూపాయలను భరణంగా తీసుకుందని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక అప్పట్లో పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలని పూనమ్ కౌర్ విశ్వ ప్రయత్నాలు చేసిందని కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పుకొచ్చింది.
దీంతో శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
కొందరు నెటిజన్లు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండడంతో కొందరు స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శ్రీ రెడ్డి ని సోషల్ మీడియాలో గిల్లితే మాత్రం ఇలాంటి సమాధానాలు ఎదుర్కోక తప్పదని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.