ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి...!  

Sri Reddy In Lakshmi\'s Veeragrandham-

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అన్నగారు ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించిన మూడు బయోపిక్‌ లు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మొదటిది బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతుండగా, రెండవది వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్నాడు. వర్మ ఎప్పుడైతే తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అంటూ ప్రకటిస్తున్నాడో అప్పుడే కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి కూడా తాను కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ను తెరకెక్కిస్తాను, అందులో లక్ష్మీ పార్వతి అసలు స్వరూపంను బయట పెడతాను అంటూ ప్రకటిస్తున్నాడు..

ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి...!-Sri Reddy In Lakshmi's Veeragrandham

తాజాగా కేతిరెడ్డి ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ సినిమాను మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించాడు.

‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రంలో కీలక పాత్రకు వివాదాస్పద తార శ్రీరెడ్డిని తీసుకోబోతున్నట్లుగా కేతిరెడ్డి ప్రకటించాడు. శ్రీరెడ్డి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ అవ్వడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌ క్రేజ్‌ పెరిగి పోయింది. తప్పకుండా ఈ చిత్రంకు శ్రీరెడ్డి హైలైట్‌గా నిలుస్తుందనే టాక్‌ వినిపస్తుంది.

అయితే శ్రీరెడ్డిని ఏ పాత్రకు తీసుకున్నాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ మద్య లక్ష్మీ పార్వతి పాత్రకు ఒక సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. కాని ఆమె నో అన్నట్లుగా సమాచారం అందుతుంది..

ఇప్పుడు శ్రీరెడ్డిని తీసుకున్నది లక్ష్మీ పార్వతి పాత్రకే అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు. కేవలం వర్మకు పోటీగా, తెలుగు దేశం పార్టీ నాయకుల మన్ననలు పొందేందుకే కేతిరెడ్డి ఈ సినిమాను చేస్తున్నాడు అనే టాక్‌ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేకపోయేది. కాని శ్రీరెడ్డి ఎంట్రీతో ఈ చిత్రంలో మ్యాటర్‌ ఉంటుందేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు నమ్మకం లేదు.

ఎందుకంటే ఈ చిత్రంపై లక్ష్మీ పార్వతి కేసు వేసి, విడుదల కాకుండా చేసే అవకాశం ఉంది.