అలా జరగదు.. జరిగితే రచ్చ రచ్చే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఈనెల 10న లాంచనంగా ప్రారంభం కాబోతుంది.నాని హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి.

 Sri Reddy In Bigg Boss Season 2-TeluguStop.com

ప్రోమోలు షోపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి.మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడంతో సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది.

గత సీజన్‌లో కేవలం 70 రోజు మాత్రమే షో కొనసాగింది.కాని ఈసారి మరో నెల రోజులు పెంచి ఏకంగా 100 రోజులు కొనసాగించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.

అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇల్లు సెట్టింగ్‌ పూర్తి అయ్యింది.ఇక ఈ షోలో కనిపించబోతున్న సెబ్రెటీలు ఎవరా అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎంతో మంది పేర్లు పరిశీలించారు.ఎంతో మంది పేర్లు మీడియాలో ప్రచారంకు వస్తున్నాయి.అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శ్రీరెడ్డి.ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోయింది.కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈమె మొదలు పెట్టిన ఉద్యమం అనేక మలుపులు తీసుకుని, చివరకు ఆమె నాశనంకు దారి తీసింది.ఆ విషయాన్ని పక్కన పెడితే ఈమెను బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

శ్రీరెడ్డి బిగ్‌బాస్‌ ఎంట్రీపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మీడియాలో వస్తున్నవన్ని కూడా పుకార్లే అని, ఖచ్చితంగా శ్రీరెడ్డి బిగ్‌బాస్‌లో ఉండదు అంటూ చెబుతున్నారు.

ఇటీవలే నానిని ఉద్దేశించి అత్యంత హీనమైన మాటలను, వ్యాఖ్యలను శ్రీరెడ్డి వదిలింది.సోషల్‌ మీడియాలో నానిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.

అలాంటిది నాని హోస్ట్‌గా చేస్తున్న షోకు ఆమెను ఎలా పార్టిసిపెంట్‌గా తీసుకు వస్తారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.స్టార్‌ మా వారు సంప్రదించినా కూడా నాని హోస్ట్‌ కనుక తాను చేయను అంటూ ఆమె తెగేసి చెప్పేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఆమె కనుక బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఉంటే రచ్చ రచ్చ ఖాయం అంటున్నారు.ఎందుకంటే బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లిన ఎక్కువ శాతం మంది ఆమెతో సన్నిహితంగా ఉండరు.

నానిని ఇంప్రెస్‌ చేసేందుకు లేదా, మెగా ఫ్యాన్స్‌ను ఇంప్రెస్‌ చేసి ఓట్లు వేయించుకునేందుకు శ్రీరెడ్డిని టార్గెట్‌ చేస్తారు.అలా చేయడం వల్ల షో రచ్చ రచ్చగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని కొందరు భావిస్తున్నారు.

అయితే శ్రీరెడ్డి బిగ్‌బాస్‌కు వెళ్లినా రెండు లేదా మూడు వారాల్లోనే ఆమె బయటకు వస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube