టాలీవుడ్ వివాదాస్పద నటి, బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి గురించి అందరికీ పరిచయమే.గతంలో క్యాస్టింగ్ కౌచ్ తో ఎంతలా రచ్చ చేసిందో చూసాం.
అప్పటి నుండి శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.తరచు వివాదాలతో ముందుకు వచ్చింది.
కొందరి హీరోల పేర్లను బాగా వాడుకుంది.ఆ తర్వాత తనకు మరో నటుడితో ఎఫైర్ ఉన్న విషయాన్ని కూడా తానే బయట పెట్టుకుంది.
అలా ఎన్నో వివాదాలతో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి తాజాగా సామ్, చైతన్య ల బంధం గురించి హాట్ కామెంట్స్ చేసింది.
శ్రీ రెడ్డి ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన కూడా సోషల్ మీడియా వేదికగా మాత్రం నిత్యం తనేంటో చూపిస్తుంది.
రాజకీయ నాయకుల పై విమర్శలు చేస్తూ.కొందరు స్టార్ హీరోల గురించి నెగటివ్ కామెంట్లు పెడుతూ రచ్చ చేయడమే కాకుండా.
తన బోల్డ్ ఫోటోలతో మాత్రం మరింత రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగ చైతన్య, సమంత గురించి కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంట త్వరలోనే విడిపోతుందని ఎన్నో పుకార్లు వచ్చాయి.అందుకే సమంత నాగచైతన్య కు దూరంగా ఉంది అంటూ.ఫ్యామిలీ మొత్తాన్ని విడిచిపెట్టి గోవా కి వెళ్ళింది అంటూ బాగానే పుకార్లు వచ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదలవడంతో.
ఈ ట్రైలర్ ను నాగ చైతన్య తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
దీంతో సమంత ఈ ట్రైలర్ గురించి స్పందించగా నాగ చైతన్య థాంక్యూ సమంత అని బదులిచ్చాడు.ఇక ఈ ట్వీట్ తో అభిమానులు మళ్లీ ఆలోచనలో పడ్డారు.ఇక ఈ విషయం గురించి శ్రీ రెడ్డి స్పందిస్తూ సినీ ఇండస్ట్రీలో ఈ కపుల్ బెస్ట్ కపుల్ అంటూ.
స్వీట్ అండ్ క్యూట్ కపుల్ గా ఉన్నారంటూ.వారిపై తప్పుడు వార్తలు చెయ్యొద్దని పుకార్లు సృష్టించవద్దని షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.