కాచుకోరా నాని, నీ కాపురం లో నిప్పులే : శ్రీ రెడ్డి సంచలన ఫేస్బుక్ పోస్ట్ లు       2018-06-08   00:38:04  IST  Raghu V

శ్రీ రెడ్డి ఇటీవల కాలం లో చాలా పాపులర్ అయిన అమ్మాయి. కాస్టింగ్ కౌచ్ విషయాన్ని తెర పైకి తీసుకువచ్చి తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా ఫేస్బుక్ లో పోస్ట్ లు పెడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. మొన్న ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై చేదు పదజలన్ని వాడి పవన్ ఫ్యాన్స్ చేతిలో ఫేస్బుక్ లో తీవ్ర విమర్శలు ఎదురుకుంది. ఈమెకి తెలుగు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది అని తెలుస్తుంది కానీ అందులో ఎంత నిజమే ఇప్పటికి తెలియదు. అయితే ఏ మధ్య పవన్ కళ్యాణ్ పై ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పైన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి మళ్ళీ వార్తల్లో నిలిచింది.

మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబం, నేచురల్ స్టార్ నానిని కూడా శ్రీరెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలతో చెలరేగిపోతోంది. తాజాగా శ్రీరెడ్డి నానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

పవన్ పైన పొలిటికల్ టార్గెట్

శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె వ్యక్తిగత ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తూ రాజకీయంగా దిగజార్చడమే తన ఉద్దేశంగా శ్రీరెడ్డి కామెంట్లు ఉన్నాయి.

చిరు పైన వ్యాఖ్యలు

పవన్ ని విమర్శిస్తూ చిరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ అన్న ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు. నమ్ముకున్నోడిని నిండా ముంచాడు అంటూ కొన్ని పేర్కొనలేని అసభ్య పదప్రయోగం చేసింది. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేసావో ఎవరికి తెలియదు అంటూ పవన్ ని ఉద్దేశించి విమర్శించింది.

-

నాని పైన , దగ్గుబాటి రానా ని కూడా వదల్లేదు

నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఓ ట్వీట్ చేసింది. నాని రాసలీలలు అన్ని బయట పెడతా. కాచుకోరా నాని.. నీ కాపురంలో నిప్పులే అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.రానా దగ్గుబాటిని బావ అంటూ వ్యాఖ్యలు చేసింది.

శ్రీ రెడ్డి కి తెలుగు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది అని వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే అక్కఫా హోస్ట్ గా చేసేది నానినే మరి అతనితో బిగ్ బాస్ షో లో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి..