శ్రీరెడ్డికి బిస్కట్‌ వేసిన లారెన్స్‌  

Sri Reddy Gets Movie Chance In Lawrence Movie-

 • తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు కొన్నాళ్లుగా నిద్ర లేకుండా చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ స్టార్‌డంను దక్కించుకుంటుంది. ఈమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించడంతో పాటు, తాజాగా ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

 • శ్రీరెడ్డికి బిస్కట్‌ వేసిన లారెన్స్‌-Sri Reddy Gets Movie Chance In Lawrence Movie

 • ఆ పెద్ద ఛాన్స్‌ శ్రీరెడ్డికి ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు రాఘవ లారెన్స్‌.

 • Sri Reddy Gets Movie Chance In Lawrence Movie-

  ఆమద్య శ్రీరెడ్డి ఈయనపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి ఆరోపణలతో లారెన్స్‌ కూడా కోపం వచ్చింది. శ్రీరెడ్డిపై తీవ్రంగా మండి పడేందుకు మీడియా ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

 • కాని సన్నిహితులు ఆపడంతో మీడియా ముందుకు రాలేదు. అయితే శ్రీరెడ్డిని స్వయంగా ఇంటికి పిలిచి మరీ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది.

 • శ్రీరెడ్డికి లారెన్స్‌ ఛాన్స్‌ ఎందుకు ఇచ్చాడా అంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు మాత్రం తన గురించి మరోసారి శ్రీరెడ్డి అలా మాట్లాడవద్దనే ఉద్దేశ్యంతో ఛాన్స్‌ ఇచ్చాడని అంటున్నారు.

 • Sri Reddy Gets Movie Chance In Lawrence Movie-

  తనకు లారెన్స్‌ ఛాన్స్‌ ఇచ్చిన విషయాన్ని ఫేస్‌ బుక్‌ ద్వారా శ్రీరెడ్డి ప్రకటించింది. తాను నేడు లారెన్స్‌ ఇంటికి వెళ్లాను, అక్కడ ఆయన నన్ను ఎంతో బాగా రిసీవ్‌ చేసుకున్నాడు. అకడ ఎంతో మంది చిన్న పిల్లలున్నారు.

 • ఆ పిల్లలతో సరదాగా గడిపాను. ఆ తర్వాత లారెన్స్‌ గారి ముందు ఆడిషన్స్‌ నిర్వహించాను, ఆయన కోరుకున్నట్లుగా నేను ఉండటంతో సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.

 • సినిమాలో ఎంపిక అయ్యావంటూ ప్రకటించడంతో పాటు, అడ్వాన్స్‌ను కూడా లారెన్స్‌ ఇచ్చాడట. మొత్తానికి లారెన్స్‌ ఒక పెద్ద బిస్కట్‌ వేసి శ్రీరెడ్డి నోరు మూయించే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాడని చెప్పుకోవచ్చు