ఈసారి విశాల్‌పై.. అందరిని హై టెన్షన్‌ పెడుతున్న శ్రీరెడ్డి     2018-07-15   10:36:56  IST  Ramesh Palla

గత కొంత కాలంగా తెలుగు సినిమా ప్రముఖులను భయపెడుతున్న శ్రీరెడ్డి ఇటీవల కోలీవుడ్‌ వైపు వెళ్లింది. ఈ అమ్మడు తాజాగా తమిళ దర్శకుడు మురుగదాస్‌తో పాటు హీరో శ్రీకాంత్‌ మరియు దర్శకుడు రాఘవలారెన్స్‌పై సంచలన రీతిలో విమర్శలు చేయడం జరిగింది. అయిదు సంవత్సరాల క్రితం తమిళ హీరో శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో తనను వాడుకున్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి రాఘవ లారెన్స్‌ విషయంలో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని నెలల పాటు ఆయనతో తాను రిలేషన్‌షిప్‌ను మెయింటెన్‌ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. రాఘవలారెన్స్‌పై శ్రీరెడ్డి చేసిన విమర్శలకు కోలీవుడ్‌ నుండి పలువురు స్పందిస్తున్నారు.

గతంలో శ్రీరెడ్డిపై తమిళ హీరో విశాల్‌ విరుచుకు పడ్డాడు. నానిపై లేని పోని విమర్శలు చేస్తున్నావు అంటూ శ్రీరెడ్డిని హెచ్చరించడం జరిగింది. నాని గురించి తనకు తెలుసు అని, ఆతడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా తన భాష సినిమా వారిపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో విశాల్‌ మళ్లీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళ మీడియాలో శ్రీరెడ్డిపై విశాల్‌ విరుచుకు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది.

Did Vishal Threaten Sri Reddy-

Did Vishal Threaten Sri Reddy

విశాల్‌ చాలా ఆవేశపరుడు, ఆయన తన వారిపై మాట పడకుండా జాగ్రత్త పడతాడు. నేను లారెన్స్‌, శ్రీకాంత్‌లను విమర్శించినందుకు చంపేసినా చంపేస్తాడు. ఎప్పటికైనా నాకు విశాల్‌తో హాని ఉందని, విశాల్‌ తనను చంపేస్తాడేమో అనే భయం ఉంది అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై విశాల్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

ఒకవేళ విశాల్‌ ఈ విషయమై మళ్లీ స్పందిస్తే ఖచ్చితంగా మరింత సీరియస్‌గా శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే విశాల్‌ ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే పరువు దక్కుతుందని, లేదంటే విశాల్‌ను సైతం రోడ్డుమీదకు తీసుకు రావడంలో శ్రీరెడ్డి ఏమాత్రం ఆలోచించదు అంటూ ఈ సందర్బంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి అందరిని హైటెన్షన్‌కు గురి చేస్తోంది.