'అరవింద సమేత' పై 'శ్రీరెడ్డి' వింత కామెంట్స్..! ఫాన్స్ ఇంకెందుకు లేట్ అంటూ ఏమందో తెలుసా.?  

Sri Reddy Different Comments On Ntr Aravinda Sametha Movie-

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు.ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు.

Sri Reddy Different Comments On Ntr Aravinda Sametha Movie--Sri Reddy Different Comments On NTR Aravinda Sametha Movie-

అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు.దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై ప్రశంసలు అందుకుంది.ఇక ఎప్పటిలాగే నెగటివ్ గా కామెంట్స్ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్న శ్రీరెడ్డి ఈ సినిమాపై కూడా కామెంట్స్ చేసింది.

శ్రీరెడ్డి ట్విట్టర్ లో.ఇంకెందుకు ఆలస్యం – ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా తొడకొట్టండి.అరవింద సమేత చిత్రం చాలా బాగుంది ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు అంటూ ట్వీట్ చేసింది.యంగ్ టైగ‌ర్ మ‌రోమారు త‌న స‌త్తా చాటాడ‌నీ.తారక్ అన్న జిందాబాద్ అంటూ ట్వీట్ చేసింది.దీంతో నందమూరి అభిమానులు ఆ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ – లైక్ లు కొట్టేస్తున్నారు.

శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ను – పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.పవన్ పై కొన్ని సార్లు శృతి మించి మరీ పోస్ట్ లు పెట్టిన శ్రీరెడ్డి తాజాగా ఎన్టీఆర్ విషయంలో మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.