ఎమ్మెల్యేపై శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంకా చాలా మంది ఉన్నారు   Sri Reddy Comments On Political Leader Jeevan Reddy In TRS     2018-10-15   15:12:10  IST  Ramesh P

బాలీవుడ్‌లో తనూశ్రీ లైంగిక ఆరోపణలు మొదలు కాకముందే తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి లైంగిక ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఎంతో మంది స్టార్స్‌ తనను లైంగికంగా వేదించారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, పలువురి జీవితాలను రోడ్డుకు తీసుకు వచ్చిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది. సినిమా ఆఫర్‌ వస్తే అయినా ఈమె సైలెంట్‌గా ఉంటుందేమో అని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈమె తన విమర్శలను గుప్పిస్తూనే ఉంది.

ఇన్నాళ్లు సినిమా పరిశ్రమ వారిపై ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గంకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఈ సంచన విషయాన్ని బయటకు చెప్పింది. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తనను పలు సార్లు లైంగికంగా వేదించాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. జాతీయ మీడియాలో శ్రీరెడ్డి ఈ ఆరోపణలు చేసిన విషయంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈవిషయమై చర్చ జరుగుతుంది.

Sri Reddy Comments On Political Leader Jeevan In TRS-

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డితో పాటు నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కూడా ఈమె ఆరోపణలు చేసింది. తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఎంతో మంది నన్ను లైంగికంగా వేదించారు. వారంతా కూడా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. వారందరి పేర్లు కూడా బయటకు తీసుకు వస్తాను, త్వరలోనే అందరి గురించి బయట పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు వారి గురించి చెప్పే టైం కాదని, సమయం వచ్చినప్పుడు అంతా జరిగి పోతుందని, అప్పటి వరకు మీరు మనశ్శాంతిగా ఉండండి అంటూ తనను లైంగికంగా వేదించిన వారికి హెచ్చరికలు జారీ చేసింది.