శ్రీరెడ్డి అన్నింట్లో వేలు పెట్టి కూర్చుంటుంది       2018-06-27   00:55:49  IST  Raghu V

శ్రీరెడ్డి గురించి ప్రస్తుతం పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి మెల్ల మెల్లగా ఫేడవుట్‌ అవుతుంది. మొన్నటి వరకు పలు ఛానెల్స్‌లో గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చిన ఈమె ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మాత్రమే కనిపిస్తూ వస్తుంది. ఛానెల్స్‌ వారు ఈమె మాటలు వినేందుకు ఆసక్తి చూపక పోవడంతో పాటు, వరుసగా ఈమెపై విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో సోషల్‌ మీడియాలో మాత్రమే ఈమె కనిపిస్తూ వస్తుంది. స్టార్స్‌ను టార్గెట్‌ చేయడంతో ఈమె పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు ఆ స్టార్స్‌ వల్లే ఈమె కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుంది.

పలువురు స్టార్‌ హీరోలపై మరియు ప్రముఖులపై విమర్శలు, తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిని ఎలక్ట్రానిక్‌ మీడియా వారు బహిష్కరించారు. తమ ఛానెల్స్‌లో ఈమెకు ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. దాంతో ఆమె ఫేస్‌బుక్‌ వేదికగానే తాను అనుకున్న విషయాలు చెబుతూ ఉంది. అందరి దృష్టి తనపై ఉండాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉన్న అంశాలపై మాట్లాడుతూ వస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈ అమ్మడు తన పద్దతి మార్చుకోకుండా తనకు సంబంధం లేని విషయాల్లో స్పందిస్తూ వస్తుంది. గత కొంత కాలంగా ఫేస్‌బుక్‌లో తెగ హడావుడి చేస్తున్న ఈ అమ్మడు తాజాగా జూనియర్‌ ఆర్టిస్టులు చేస్తున్న దీక్షల్లో పాల్గొటుంది.

తనకు సంబంధం ఉన్నా లేకున్నా మీడియాలో కవరేజ్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో శ్రీరెడ్డి అన్ని విషయాల్లో కూడా పాలు పంచుకుంటుంది. ఆ మద్య విజయవాడ, ఆ తర్వాత వైజాగ్‌ ఇలా ఎక్కడ ఏ విషయం గురించి ఆందోళనలు జరిగినా కూడా తాను ఉన్నాను అంటూ నిరూపించుకునేందుకు రంగంలోకి దిగి ఆందోళనలు చేస్తోంది. ఈమె పబ్లిసిటీ కోసం పడుతున్న కష్టంకు కొందరు నవ్వుకుంటున్నారు. మొన్నటి వరకు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఇప్పుడు ఇలా దీక్షలు, ఉద్యమాల ద్వారా దృష్టిలో పడాలనే అభిప్రాయంలో ఉంది.

ప్రస్తుతం ఈమె చేస్తున్న ఆందోళనలు మరీ చిల్లరగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ సంఘాల వారితో భేటీలు, వారితో కలిసి ఉద్యమాలు అంటే పర్వాలేదు కాని, ఈమె ఈమద్య మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న పనులు మరీ చీప్‌గా ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రతి విషయంలో కూడా వేలు పెట్టి గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న శ్రీరెడ్డి కొన్నాళ్లకు పూర్తిగా ఫేడ్‌ ఔట్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.