అమ్మ బాబోయ్ : ఆ హీరో తన అన్నలాంటి వాడంటున్న శ్రీ రెడ్డి

ఎలాంటి విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ తనదైన శైలిలో రెచ్చిపోయే తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి శ్రీ రెడ్డి తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అయింది.

 Actress Sri Reddy About Tamil Hero Udhayanidhi Stalin, Sri Reddy, Telugu Actress-TeluguStop.com

అయితే ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ నటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏకంగా తెలుగు సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.ఇక అప్పటి నుంచి తన అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే తమిళంలో పలు చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరో “ఉదయనిధి స్టాలిన్” డీఎంకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా  జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు.దీంతో ఇటీవలే ఓ బిజెపి పార్టీకి చెందిన అభ్యర్థి ఉదయనిది స్టాలిన్ కి గతంలో తమిళ్ సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ హీరోయిన్ తో ఎఫైర్ లు ఉన్నాయంటూ పరోక్షంగా విమర్శలు చేశాడు.

దీంతో తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందించింది.

Telugu Dmk, Chennai, Sreereddy, Sri Reddy, Srireddy, Tamil, Telugu Actress, Ysja

ఇందులో భాగంగా ఉదయనిది స్టాలిన్ చాలా మంచి వ్యక్తి అని అలాగే ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాగా మంచి హృదయం కలిగిన వ్యక్తి అని అతడిని ఎన్నుకుంటే కచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఎన్నికలలో ఉదయనిది స్టాలిన్ కి ఓట్లు వేయాలని కూడా తన అభిమానుల్ని కోరింది.అలాగే తనకు ఉదయనిధి స్టాలిన్ అన్నలాంటి వాడని కూడా చెప్పుకొచ్చింది.

ఇక ఈ విషయంపై స్పందించడానికి తనకి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, అలాగే ఈ విషయం తర్వాత తనని ఎవరైనా టార్గెట్ చేయాలని చూస్తే ఊరుకోనని కూడా హెచ్చరించింది.అలాగే డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రముఖ దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో మాదిరిగానే చాలా తొందరగా అభివృద్ధి జరుగుతుందని కాబట్టి ప్రజలు తప్పకుండా డీఎంకే పార్టీ ని గెలిపించాలని కోరింది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి శ్రీ రెడ్డి తెలుగులో “క్లైమాక్స్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు సరికదా కనీసం విడుదలయినట్లు కూడా చాలామందికి తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube