రాశిపై మండిపడుతున్న ‘నగ్నం’ సుందరి  

Sri Rapaka Deeply Hurt With Raashi Khanna, Sri Rapaka, Raashi Khanna, Naked, Tollywood News - Telugu Naked, Raashi Khanna, Sri Rapaka, Tollywood News

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నగ్నం అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టీజర్‌తోనే అదిరిపోయే క్రేజ్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఈ సినిమా ద్వారా శ్రీ రాపాక అనే హీరోయిన్‌గా పరిచయం చేశాడు.

 Sri Rapaka Deeply Hurt With Raashi Khanna

పూర్తి బోల్డ్ కంటెంట్ సినిమాగా వచ్చిన ‘నగ్నం’లో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోయాయి.ఈ సినిమాతో ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు.

అయితే శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సమస్యలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నాతో తనకు ఎదురైన పరిస్థితుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.తాను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు సుప్రీమ్ సినిమాలో నటిస్తుండగా రాశి ఖన్నా తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి సెట్స్‌కు రమ్మని ఆర్డర్ వేసిందట.

రాశిపై మండిపడుతున్న ‘నగ్నం’ సుందరి-Gossips-Telugu Tollywood Photo Image

రాశికి చీర కట్టేందుకు తనను రావాల్సిందిగా కోరేదట.దీంతో ఆమె సెట్స్‌కు వెళ్లే సరికి అక్కడ దర్శకుడు ఆమెను తిరిగి చివాట్లు పెట్టేవాడట.

సెట్స్‌పై చాలా మంది ఆడవారు ఉండగా, ప్రత్యేకంగా శ్రీ రాపాక ఎందుకు వచ్చిందని ఆమెను ప్రశ్నించాడట.అయితే రాశి ఖన్నా తనను ప్రత్యేకించి చీర కోసమే రావాలని పిలిచిందట.

దీంతో ఆమెకు చాలా కోపం వచ్చిందట.రాశి ఖన్నాతో ఇదే విషయంలో మనస్పర్థలు వచ్చాయని శ్రీ రాపాక అంటోంది.

ఏదేమైనా ప్రస్తుతం తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆమె తెలిపింది.నగ్నం చిత్రంలో నటించడం తన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిందంటూ ఆమె వెల్లడించింది.

#Naked #Sri Rapaka #Raashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sri Rapaka Deeply Hurt With Raashi Khanna Related Telugu News,Photos/Pics,Images..