శ్రీరాజు రాజీనామా ఆమోదిస్తున్నా

పవన్‌ కళ్యాణ్‌కు సన్నిహితుడిగా పేరున్న శ్రీరాజు రవితేజ జనసేన ఆరంభం నుండి ఉంటూ వచ్చాడు.పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీరాజు ఆమద్య పార్టీకి రాజీనామా చేసి వెళ్లి పోయాడు.

 Sri Raju Ravi Teja Good Bye To Janasena Party-TeluguStop.com

అయితే మళ్లీ పార్టీలోకి శ్రీరాజు పార్టీలోకి రావడంతో పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు మళ్లీ పార్టీ పొలిట్‌ బ్యూరో పదవిని కట్టబెట్టాడు.శ్రీరాజు మళ్లీ పార్టీకి గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించాడు.

పార్టీలో క్రమశిక్షణ లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన పొలిట్‌ బ్యూరో సభ్యత్వంకు మరియు పార్టీ ప్రాధమిక సభ్యత్వంకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

శ్రీరాజు రవితేజ పార్టీకి రాజీనామా చేయడంపై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా స్పందించారు.

ఆయన పేరుమీద ఒక ప్రెస్‌నోట్‌ విడుదల అయ్యింది.జనసేన పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీరాజు రవితేజ గారు పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నాం.

ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదన, అభిప్రాయాలను గౌరవిస్తున్నాం.గతంలో కూడా ఆయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి వచ్చారు.

ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.ఆయన కుటుంబంకు శుభం కలగాలంటూ ఆ జగన్మాతను కోరుకుంటున్నాను అంటూ పవన్‌ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube