రాహుల్‌ విన్నర్‌ అయినా శ్రీముఖిని క్రాస్‌ చేయలేక పోయాడు, ఇది ఆమె ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌గా రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచి 50 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీని దక్కించుకున్న విషయం తెల్సిందే.రాహుల్‌ రోజు వారి పారితోషికం రూ.30 వేలతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.వంద రోజులు ఉన్నాడు కనుక ఆ పారితోషికం 30 లక్షలు మరియు ప్రైజ్‌ మనీ 50 లక్షలు మొత్తం కలిపి 80 లక్షల రూపాయలను రాహుల్‌ దక్కించుకున్నాడు.

 Sri Mukhi Better Than Rahul In Remunaration-TeluguStop.com

ఈ డబ్బుతో అతడు కోరుకున్నట్లుగా మంచి ఇల్లు కొని తల్లిదండ్రులకు గిఫ్ట్‌ ఇవ్వొచ్చు.అలాగే తాను అనుకుంటున్నట్లుగా ఒక మంచి సెలూన్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు.

Telugu Sri Mukhi, Sri Mukhi Rahul, Sri Mukhi Lakhs, Telugu Big Boss-

రాహుల్‌ ఏమాత్రం ఊహించకుండానే ఈ విజయాన్ని దక్కించుకున్నాడు.అతడు చేరుకున్న ఈ విజయంకు అంతా అవాక్కవుతున్నారు.శ్రీముఖి అభిమానులు అయితే రాహుల్‌ను ఇష్టం ఉన్నట్లుగా ట్రోల్‌ చేస్తున్నారు.శ్రీముఖి మరియు పున్నుల వల్లే నీవు ఈ స్థితికి వచ్చావు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.ఇక మరి కొందరు రాహుల్‌ నీవు ట్రోఫీ దక్కించుకున్నా శ్రీముఖి ముందు తక్కువే అంటున్నారు.శ్రీముఖి రోజుకు 1.5 లక్షల పారితోషికంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Telugu Sri Mukhi, Sri Mukhi Rahul, Sri Mukhi Lakhs, Telugu Big Boss-

వంద రోజులకు పైగా శ్రీముఖి ఇంట్లో ఉన్న కారణంగా మొత్తంగా శ్రీముఖికి 1.5 కోట్ల మేరకు పారితోషికంగా దక్కింది.అంటే రాహుల్‌ కంటే దాదాపు డబుల్‌ అన్నమాట.

శ్రీముఖి ఈ పారితోషికం మొత్తంను ఇప్పటికే దక్కించుకుంది.రాహుల్‌ విజేత అయినా కూడా పారితోషికం విషయంలో అతడు చాలా లీస్ట్‌లో ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

రాహుల్‌ లక్కీగా ట్రోఫీ దక్కించుకున్నాడు.అంతే తప్ప శ్రీముఖిని బీట్‌ చేసే సత్తా అతడికి లేదు అంటున్నారు.

రాహుల్‌ కంటే వరుణ్‌ కు కూడా అధికంగానే డబ్బులు దక్కాయి.రోజుకు లక్ష రూపాయల పారితోషికంతో వెళ్లిన వరుణ్‌ సందేశ్‌కు కోటి రూపాయల వరకు దక్కినట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube