శ్రీలంక కీలక నిర్ణయం.. ప్లాస్టిక్ పై..!

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అటవీ జంతువులపై అధికంగా చూపుతుందని పర్యావరణ శాఖ మంత్రి మహింద అమరవీర వెల్లడించారు.

 Srilanka, Plastic, Key Decision-TeluguStop.com

ఈ మేరకు పర్యావరణాన్ని, వన్యప్రాణుల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ప్లాస్టిక్ ను నిషేధించడంతో దీని ప్రభావం భారత్ పై అధికంగా ఉంటుందని, ఇండియా నుంచి శ్రీలంకకు ప్లాస్టిక్ దిగుమతులు అధికమవుతున్నాయని పర్యవరణ శాఖ మంత్రి వెల్లడించారు.

దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.ఈ వ్యర్థాల ప్రభావం మూగ జీవాలపై పడుతుందని, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తున్నారని ఆరోపించారు.

ఆకలితో జంతువులు ప్లాస్టిక్ ని ఆహారంగా తీసుకుంటున్నాయని ఆయన అన్నారు.దీని వల్ల దేశంలో ఏనుగులు, జింకలు భారీ సంఖ్య మరణించడం జరిగిందన్నారు.వీలైనంత తొందరగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కట్టడి చేయాలని నిర్ణయించారు.మూగ జీవాల ప్రాణాలు కాపాడే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేసిందని, అందుకే ప్లాస్టిక్ దిగుమతులపై నిషేధం విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువులకు తప్ప వేరే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం జరగదని అన్నారు.కాగా, భారత్ తర్వాత చైనా, థాయ్ లాండ్ దేశం నుంచి శ్రీలంక అధికంగా ప్లాస్టిక్ ను దిగుమతి చేసుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube