ప్రపంచ కప్ లో అనూహ్య ఘటన...లంక చేతిలో ఇంగ్లాండ్ పరాజయం  

Sri Lanka Won The Match -

ప్రపంచ కప్ క్రికెట్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ జట్టుకు శ్రీలంక జట్టు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది.

Sri Lanka Won The Match

గత కొంత కాలంగా శ్రీలంక జట్టు ప్రదర్శన పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వాటన్నిటిని పక్కన పెట్టిన లంక జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించడం తో ఇంగ్లాండ్ జట్టు సతికిల బడింది.

ప్రపంచ కప్ లో అనూహ్య ఘటన…లంక చేతిలో ఇంగ్లాండ్ పరాజయం-Sports News క్రీడలు-Telugu Tollywood Photo Image

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు తోలి మూడు రన్స్ కే రెండు కీలక వికెట్లు కోల్పోవడం తో లంక జట్టు ఇక తేరుకోలేదు అని అనుకున్నారు అందరూ.అయితే నిర్ణీత 50 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

అయితే అనంతరం 233 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు లంక బౌలర్లు మలింగా,స్పిన్నర్ ధనుంజయ ధాటికి 47 ఓవర్ల లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది.ఇంగ్లాండ్ జట్టు లో స్టోక్స్ (82; 89బంతుల్లో,7 ఫోర్లు, 4 సిక్సులు) అజేయంగా నిలిచాడు.రూట్ (57; 89 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మలింగ(4/43)కు దక్కింది.స్పిన్నర్ ధనుంజయ 3 వికెట్లు తీశాడు.ప్రపంచకప్‌లో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్‌కు అనూహ్య పరాజయం ఎదురైనట్లు అయ్యింది.

తాజా వార్తలు

Sri Lanka Won The Match- Related....