ప్రస్తుతం దివాళా తీసిన శ్రీలంక.. గతంలో ఎంత ధనిక దేశం అంటే...

ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నానా అవస్థలు పడుతోంది కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.చాలా సిరిసంపదలతో ఈ దేశం విలసిల్లేది.

 Sri Lanka Is Now Bankrupt. What A Rich Country In The Past. Srilanka, History, V-TeluguStop.com

అందుకే ఈ దేశానికి శ్రీలంక అనే పేరు వచ్చిందని అంటారు.శ్రీలంక అనే పదానికి అర్థం ఆ దేశ ప్రజలకు కూడా తెలియక పోవచ్చు.

ఎందుకంటే శ్రీలంక అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది.ఆ దేశం పేరులోని లంక, శ్రీ అనే పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి.

మొదటగా లంక అంటే ఏంటో తెలుసుకుంటే.లంక అనే పదానికి సంస్కృతంలో ‘తేజస్సుగల భూమి’ లేదా ద్వీపం అని అర్థం.

చుట్టూ నీళ్లు ఉండి, మధ్యలో భూమి ఉన్న ప్రదేశాన్ని కూడా లంక/ఐలాండ్ అని కూడా పిలుస్తారు.హిందు ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలలో కూడా లంక అనే పదం పలు చోట్ల కనిపిస్తుంది.

మరి లంక అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా.శ్రీ అంటే కూడా ఏంటో కూడా తెలుసుకుందాం.

సంస్కృతంలో ‘శ్రీ‘ అనే పదానికి ప్రకాశం, సంపద, శ్రేయస్సు అని అర్థం వస్తుంది.అప్పట్లో లంకలో బాగా సిరిసంపదలు నెలకొన్నాయి కాబట్టే దీనికి శ్రీలంక అని పేరు పెట్టారు.

శ్రీలంక అనే పేరు రామాయణ కాలం నుంచి ఉంది.ఆ కాలంలోనే ప్రజలు శ్రీలంకను భాగ్యవంతమైన రాజ్యంగా పిలిచేవారు.

ఎందుకంటే ఇక్కడ సిరి సంపదలు ఎక్కడ చూసినా కనిపించేవి.

Telugu Srilanka, Latest-Latest News - Telugu

అప్పట్లో లంక గ్రామాలకు అక్కడున్న వనరులు, అక్కడ ఎక్కువగా నివసించే కుటుంబాల ఇంటిపేర్ల ఆధారంగా కూడా పేర్లు పెట్టే వారు.ఉదాహరణకి పిచ్చుకలు ఎక్కువగా ఉన్నాయని ఒక ఊరికి పిచ్చుకల లంక అని నామకరణం చేశారు.అలానే బండారు అనే ఇంటి పేరు ఉన్న కుటుంబాలు ఒక గ్రామంలో ఎక్కువగా ఉండగా ఆ గ్రామానికి బండారు లంక అనే పేరు పెట్టారు.

అంతే కాకుండా ఊబి ఉన్న లంక ఊరికి ఊబ లంక అని నామకరణం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube