సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం..!

శ్రీలంక ప్రభుత్వం ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాను నిషేధించాలనే ఒక కీలక నిర్ణయం తీసుకుంది.శనివారం రోజు శ్రీలంక ప్రజా భద్రతా శాఖ మంత్రి శరత్ వీరశేఖర మాట్లాడుతూ.

 Key Decision, Srilanka Government, New Decision, Muslim Womens, Colombo, Burqa T-TeluguStop.com

బుర్ఖా అనేది తీవ్రవాదానికి నిదర్శనమని.దేశంలో దీన్ని నిషేధించాలని శుక్రవారం రోజు తాను ఒక పత్రం పై సంతకం కూడా చేశానని.

త్వరలోనే ఈ పత్రాన్ని క్యాబినెట్ ముందు ఉంచుతామని ఆయన చెప్పుకొచ్చారు.కొందరు ముస్లిం మహిళలు మొహం కనిపించకుండా బుర్ఖాను పూర్తిగా ధరిస్తున్నారని.

కానీ దేశ భద్రత దృష్ట్యా బుర్ఖాను నిషేధించడం తప్పనిసరి అయిందని ఆయన అన్నారు.బుర్ఖా నిషేదం పై క్యాబినెట్ ఆమోదం తెలిపేలా కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

గతంలో ముస్లిం మహిళలు, యువతులు బుర్ఖా ధరించేవారు కాదని కానీ ఇటీవల కాలంలో బుర్ఖా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని.దీనివల్ల దేశంలో శాంతిభద్రతల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.2019 వ సంవత్సరం లో ఇస్లామిక్ తీవ్రవాదులు శ్రీలంక లోని అతి పెద్ద నగరమైన కొలంబోలో ప్రార్థనా మందిరాలు, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడ్డారు.అయితే ఈ తీవ్రవాద దాడిలో మొత్తం 250 మందికి పైచిలుకు చనిపోయారు.దీంతో అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం తాత్కాలికంగా బుర్ఖా ధరించడం పై నిషేధం విధించింది.అప్పటి రక్షణ శాఖ మంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు గోటబాయ్ రాజపక్ష ఇస్లామిక్ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఆయన తెలిపారు.

అయితే దేశంలో ఉన్న 1000 మదర్సా ఇస్లామిక్ స్కూళ్లను మూసి వేసే యోచనలో శ్రీలంక ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.దీనికి ముఖ్య కారణం ఇస్లామిక్ స్కూళ్లు శ్రీలంక జాతీయ విద్యా విధానం పాలసీకి విరుద్ధంగా వ్యవహరించడమేనని తెలుస్తోంది.

మసీదుల్లో కూడా ఇష్టానుసారంగా జంతువులను బలిస్తున్నారని.వీటిని తాము ఎట్టి పరిస్థితులలోనూ సహించబోమని శ్రీలంక ప్రభుత్వం మండిపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube