శ్రీలంక క్రికెటర్ల పై విరుచుకుపడ్డ టీమ్ ఇండియా క్రికెటర్స్..!

క్రీకెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.

 Sri Lanka Cricketer, Cricketer S, Team India, Sixers, Ind Vs Sr 2021,latest News-TeluguStop.com

ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.

ఇకపోతే తాజాగా భారత జట్టు శ్రీలంకతో వన్డే సీరిస్ కు బయల్దేరిన విషయం తెలిసిందే.శ్రీలంకతో వన్డే సిరీస్‌ కు ముందుగా రెండో ఇంట్రా స్క్వాడ్‌ ప్రా‍క్టీస్‌ మ్యాచ్‌ జరిగింది.

ఆ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు.గురువారం ఈ మ్యాచ్ మొదలైంది.

ఈ మ్యాచ్‌లో మొదటగా టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు, యజ్వేంద్ర చహల్‌ 2 వికెట్లు తీసి అదరగొట్టారు.ఆ తర్వాత శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మెన్లు బౌండరీలు, సిక్సర్లతో అదరగొట్టేశారు.

హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, నితీష్ రాణాలు అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ చూపించి ఆకట్టుకున్నారు.వారు మంచి ఫామ్ లోకి రావడంతో బౌలర్లకు చెమటలు పట్టించారు.

Telugu Cricketer, Ind Sr, Sixers, Srilanka, India-Latest News - Telugu

మామూలుగా ఏవిధంగా అయితే మ్యాచ్ లు ఆడతారో ఆ విధంగానే వారు బ్యాటింగ్ చేసి అదరగొట్టారు.భారత జట్టు మ్యాచ్ ఆడటం చూసి శ్రీలంక క్రికెట్ బోర్డు తన యూట్యూబ్ ఛానల్ లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో చహల్‌, కుల్దీప్‌తో పాటు నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్‌, చేతన్‌ సకారియాలు వరుసగా వికెట్లు తీసి బ్యాట్స్ మెన్లకు చెమటలు పట్టించారు.వరుసగా వికెట్లు తీసి ఆశ్చర్యపరిచారు.

నితీష్‌ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్‌ తీయగా సైనీ, తన ఖాతాలో దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్‌ పాండ్యాల వికెట్లను తీసి ఔరా అనిపించారు.టీమిండియా జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ను చేతన్‌ సకారియా తీశాడు.

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జులై 13న, జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరగనున్న విషయం తెలసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube