గుడివాడ గొడవకు సంబంధించి చంద్రబాబు పై సీరియస్ అయిన శ్రీకాంత్ రెడ్డి.!!

సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రి కొడాలి నాని తన నియోజకవర్గం గుడివాడలో క్యాసినో జుద్దాం ఆటతో పాటు అర్ధనగ్న ప్రదర్శనలు చేయించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.గోవా సంస్కృతిని ఏపీ లోకి తీసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వైసీపీ పై మండిపడ్డారు.

 Sri Kanth Reddy Serious Comments On Chandrababu Details, Sri Kanth Reddy, Chandr-TeluguStop.com

ఇదే విషయానికి సంబంధించి బుద్ధ వెంకన్న ఇంకా తెలుగుదేశం పార్టీ కీలక నేతలు చంద్రబాబు, లోకేష్ ఇంకా చాలామంది నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో తాజాగా వైసీపీ నేత చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు వ్యవహారంపై మండిపడ్డారు.

సంక్రాంతి అయిపోయి 10 రోజులు కావస్తున్నా గాని… చంద్రబాబు క్యాసినో, జూదం అని రాజకీయం చేయటం అసహనం కలిగిస్తుంది అని చెప్పుకొచ్చారు.

అధికారంలోకి వైసిపి వచ్చాక ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని ఎక్కడా ప్రోత్స్తహించలేదని తెలియజేశారు.కేవలం ప్రభుత్వంపై బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు వల్ల దేశానికి లేదా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు.హైదరాబాద్ నగరాల్లో నైట్ లైఫ్ కల్చర్ తానే తీసుకు వచ్చాను అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

బార్లు.పబ్ లు.డిస్కో లు కేసినో లే నైట్ లైఫ్ అంటూ శ్రీకాంత్ రెడ్డి సెటైర్లు వేశారు.నైట్ లైఫ్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని కౌంటర్లు వేశారు.ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించిన ఘనత చంద్రబాబుది అని.కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆ సమయంలో కూడా ఉద్యోగులు అడగకుండానే 27% ఐర్ ప్రకటించటం జరిగిందని తెలిపారు.

Sri Kanth Reddy Serious Comments On Chandrababu Details, Sri Kanth Reddy, Chandrababu, Ycp Chief Vip Srikanth Reddy, Tdp, Ycp, Minister Kodali Nani, Casino, Gudivada, Ap Politics - Telugu Ap, Casino, Chandrababu, Gudivada, Kodali Nani, Sri Kanth Reddy, Ycpvip

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube