ఫ్లాప్ డైరెక్టర్ కూడా అదే దారిలో!  

Sreenu Vaitla To Direct Web Series, Sreenu Vaitla, Web Series, Dhee2, Tollywood News - Telugu Dhee2, Sreenu Vaitla, Tollywood News, Web Series

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుసబెట్టి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీను వైట్ల, ఆ తరువాత వరుసబెట్టి ఫెయిల్యూర్ సినిమాలు, అట్టర్ ఫ్లాప్ సినిమాలను తీస్తూ తన సత్తాను కోల్పోయాడు.ఇక ఏ సినిమా చేసినా ఫెయిల్ అవుతూ వస్తుండటంతో ఈ డైరెక్టర్ ఫేడవుట్ అయ్యాడు.

 Sreenu Vaitla To Direct Web Series

అయితే అడపాదడపా చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి ఫ్లాప్ అయ్యాడు శ్రీను వైట్ల.దీంతో తన కెరీర్‌లో ‘ఢీ’ చిత్రం అందించిన సక్సె‌ను మళ్లీ అందుకునేందుకు ప్రస్తుతం ఢీ సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ దర్శకుడు సినిమాలు ఫెయిల్ అవుతుండటంతో ఇప్పుడు తన అదృష్టాన్ని వెతుక్కునే రూటు కూడా మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు.ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే.

ఫ్లాప్ డైరెక్టర్ కూడా అదే దారిలో-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో శ్రీను వైట్ల కూడా ఇప్పుడు ఇదే దారిలో పయనించాలని చూస్తున్నాడు.దీని కోసం ఆయన ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

దీనికి సంబంధించిన కంటెంట్‌ను కూడా ఆయన రెడీ చేసే పనిలో పడ్డాడట.

ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ముందుకు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఢీ సీక్వెల్‌ను ఆయన మంచు విష్ణు హీరోగా తెరకెక్కించేందుకు కూడా రెడీ అవుతున్నాడు.మరి వైట్ల తెరకెక్కించబోయే ఈ వెబ్ సిరీస్ ఎలాంటి కంటెంట్‌తో వస్తుందో తెలియాలంటే మాత్రం ఇది రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కనీసం వెబ్ సిరీస్‌తోనైనా పోయిన తన సక్సెస్‌ను తిరిగి అందుకుంటాడో లేడో చూడాలి అంటున్నారు వైట్ల అభిమానులు.

#Dhee2 #Web Series #Sreenu Vaitla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sreenu Vaitla To Direct Web Series Related Telugu News,Photos/Pics,Images..