ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ శ్రీముఖి

టాలీవుడ్ లోకి నటిగా అడుగుపెట్టి తరువాత యాంకర్ గా మారిన అందాల భామ శ్రీముఖి.ప్రస్తుతం సుమ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ కలిగి ఉండి, ఎక్కువ షోలు చేస్తున్న లేడీ యాంకర్ గా శ్రీముఖి ఉంది.

 Sreemukhi's Relationship Rumors Go Viral, Tollywood, Telugu Cinema, Telugu Heroi-TeluguStop.com

రష్మీ యాంకర్ గా ఉన్న కూడా కేవలం ఆమె జబర్దస్త్ షోకి మాత్రమే పరిమితం అయ్యింది.ఇక అనసూయ రియాలిటీషోలు తగ్గించేసి సినిమాలు ఎక్కువగా చేస్తుంది.

కొన్ని షోలకి జడ్జ్ గా వెళ్తుంది.అయితే శ్రీముఖి మాత్రం గ్యాప్ ని రెండు చేతులా సద్వినియోగం చేసుకొని వరుస షోలతో దూసుకుపోతుంది.

రెమ్యునరేషన్ పరంగా సుమ రేంజ్ పెద్దది.అలాగే ఆమె కేవలం కొన్ని షోలకి మాత్రమే పరిమితం అవుతుంది.

దీంతో ఆటోమేటిక్ గా ఫీమేల్ యాంకరింగ్ లోటు అయితే ఉంది.దానిని శ్రీముఖి అవకాశంగా మలుచుకుంటుంది.

జీతెలుగు, మాటీవీలలో వరుస షోలతో ఫుల్ బిజీగా ఉంది.

Telugu Reality Shows, Sreemukh, Anchor, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఇప్పుడు యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది.శ్రీముఖి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయంలో తన పేరెంట్స్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది.అయితే ప్రస్తుతం ఆమె ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు హాట్ టాపిక్ వినిపిస్తుంది.

ఇక అతనినే పెళ్లాడబోతుందని, పెళ్లి తర్వాత కూడా యాంకర్ తన కెరియర్ కొనసాగిస్తుందని తెలుస్తుంది.అయితే సినిమాలకి ;పూర్తిగా స్వస్తి చెప్పబోతున్నట్లు సమాచారం.ఇక శ్రీముఖి రిలేషన్ గురించి ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసని, వారు కూడా అంగీకరించడంతో తన ప్రేమ జర్నీని సాగిస్తుందని సరైన సమయం చూసుకొని పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube