అమ్మ బాబోయ్ : ఈత కల్లు టేస్ట్ చేసిన శ్రీ ముఖి.... దాంతో....

తెలుగు బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి టాలీవుడ్ ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీ ముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తన యాంకరింగ్ తో అలరించడమే కాకుండా ఒసేయ్ రాములమ్మ చిత్రంలోని రాములమ్మ పాటకి చిందులేస్తూ జూనియర్ రాములమ్మ గా గుర్తింపు కూడా తెచ్చుకుంది.

 Sreemukhi White Water Tasted Video Viral-TeluguStop.com

అయితే యాంకర్ శ్రీముఖి మొదటగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “జులాయి” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైంది.

ఈ క్రమంలో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినా నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

 Sreemukhi White Water Tasted Video Viral-అమ్మ బాబోయ్ : ఈత కల్లు టేస్ట్ చేసిన శ్రీ ముఖి…. దాంతో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యాంకరింగ్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించింది.ఈ క్రమంలో ఈ అమ్మడికి బాగానే అవకాశాలు తలుపు తట్టి దాదాపుగా 15 కి పైగా షోలలో యాంకరింగ్ నిర్వహించి బాగానే అలరించింది.

అంతేకాకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలో మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని రెండో విజేతగా నిలిచింది.దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడి సినిమాకి కెరియర్ మంచి ఊపందుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీ ముఖి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.ఈ క్రమంలో తాజాగా శ్రీ ముఖి చేసినటువంటి రీల్ ద్వారా తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే షూటింగ్ బ్రేక్ సమయంలో శ్రీ ముఖి మంచి నీళ్లు తాగుతూ ఈత కల్లు తాగుతున్నట్లు నటిస్తూ ఫిల్టర్ ని ఉపయోగించి సరదాగా నవ్వించింది.అంతేగాక పెళ్లికి వచ్చానని ఇక్కడ ఈత కల్లు చాలా బాగుంటుందని కొంచెం టేస్ట్ చేయాలని తాగుతున్నానని చెప్పింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఎలా ఉన్నది ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి తెలుగు బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటులు రవీందర్, ప్రముఖ సింగర్ మను, పోసాని కృష్ణ మురళి, భరణి శంకర్ హేమ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

#Anchor #Crazy Uncles #Sreemukhi #SreemukhiWhite #White Water

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు