పిల్లలు కావాలనిపిస్తుందన్న శ్రీముఖి.. డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటూ?

బుల్లితెర యాంకర్లలో చలాకీగా, అల్లరి చేస్తూ, యాక్టివ్ గా ఉండే యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ యాంకర్ శ్రీముఖి అని చెప్పాలి.తాజాగా ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న డ్రామా జూనియర్స్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో శ్రీముఖి పిల్లలు కావాలంటూ రచ్చరచ్చ చేశారు.

 Sreemukhi Shocking Comments About Children In Drama Juniors Show,latest Promo Z-TeluguStop.com

తనదైన శైలి హోస్టింగ్ తో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న శ్రీముఖిపై కొన్నిసార్లు విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి.

జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన బొమ్మ అదిరింది షోకు యాంకర్ గా చేసిన శ్రీముఖి ఆ షో తర్వాత మరే షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే షోలలో పెద్దగా కనిపించని శ్రీముఖి ఈవెంట్లు చేయడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.శ్రీముఖి మళ్లీ బుల్లితెర షోలతో బిజీ అయితే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా రిలీజైన ప్రోమోలో శ్రీముఖి అలీతో అలీగారు చెప్పండి నేను శ్రీదేవిలా లేనా.? అని అడుగుతారు.

అలీ ఆ ప్రశ్నకు బదులిస్తూ నువ్వు శ్రీదేవిలా ఉన్నావు కానీ కొంచెం గాలి ఎక్కువైందని చెబుతాడు.ఆ తర్వాత తనకు పిల్లలు కావాలి పిల్లలు కావాలని అనిపిస్తోందని అందుకే వచ్చానని శ్రీముఖి ప్రదీప్ కు చెబుతుంది.

ఆ తరువాత నువ్వు పిల్లలు కావాలని చెప్పగానే కెమెరామెన్లు అంతా నీ వైపే చూస్తూ ఉండిపోయారని శ్రీముఖితో అలీ చెబుతాడు.డ్రామా జూనియర్స్ షోలో పిల్లలు ప్రదీప్ పెళ్లికి సంబంధించి స్కిట్ చేశారు.

పిల్లల స్కిట్ ను చూసి ప్రదీప్ కు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ కామెంట్లు చేశారు.ఆ తర్వాత సద్దాం హుస్సేన్ షోలోకి ఎంట్రీ ఇచ్చి శ్రీముఖి ప్రదీప్ కు తనకు పెళ్లిచూపులు జరుగుతున్నాయని చెప్పగా అక్కడ కూర్చుంటే శ్రీముఖి పిల్లల తల్లిలా ఉందని చెబుతూ ప్రదీప్ సద్దాం శ్రీముఖి పరువు తీసేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube