కోపరేట్ చేస్తావా అని అవినాష్ అడిగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి?

బుల్లి తెర యాంకర్ గా శ్రీముఖి( Sreemukhi ) ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.అదేవిధంగా ముక్కు అవినాష్( Avinash ) కూడా కమెడియన్ గా ప్రస్తుతం స్టార్ మా లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు ఇక శ్రీముఖి అవినాష్ ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే .

 Sreemukhi Sensational Allegations On Avinash-TeluguStop.com

వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు ఇద్దరు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు .ఇద్దరు కలిసి రీల్స్ చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.ఇకపోతే వీరిద్దరూ కూడా బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Anil Ravipudi, Avinash, Bigg Boss, Stock Exchange, Sreemukhi, Tollywood-M

అవినాష్ జబర్దస్త్ కార్యక్రమం వదిలి బిగ్ బాస్ వెళ్లడంతో ఈటీవీ వారితో పెద్ద ఎత్తున మనస్పర్ధలు వచ్చాయి ఆ సమయంలో శ్రీముఖి అవినాష్ కి కావాల్సిన డబ్బు ఇచ్చి తనని ఆదుకుందని పలు సందర్భాలలో అవినాష్ తెలిపారు.ఇలా వీరి మధ్య అంత మంచి స్నేహబంధం ఉంది అయితే తాజాగా శ్రీముఖి అవినాష్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.తనని ఇది కార్పోరేట్‌ షోకాదు.

కోపరేట్‌ చేస్తావా అని అడిగినట్టు ఆరోపించింది.అంతటితో ఆగలేదు.

ఆమే ఏకంగా స్టార్‌డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడికి ( Anil Ravipudi ) చెప్పింది.

Telugu Anil Ravipudi, Avinash, Bigg Boss, Stock Exchange, Sreemukhi, Tollywood-M

అవినాష్ తన పట్ల ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ అనిల్ రావిపూడి దగ్గర చెప్పుకొని బాధపడ్డారు.అయితే తాను ఏం చేయలేదు అలా మాట్లాడలేదని అవినాష్ అంటారు అని అందరూ భావించగా అమ్మతోడు సార్ నేను అలాగే మాట్లాడాను అంటూ అవినాష్ షాక్ ఇచ్చారు.అయితే ఇదంతా కూడా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ( Comedy Stock Exchange ) సీజన్ టు కార్యక్రమం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ షోలో భాగంగా చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇదివరకే ఆహాలో ఈ కార్యక్రమం సీజన్ వన్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు సీజన్ టు ప్రారంభిస్తున్నారు.

ఏది ఏమైనా అవినాష్ పట్ల శ్రీముఖి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube