యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?

యాంకర్ శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు.హీరోయిన్ అవదామని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా యాంకర్ గా బుల్లితెర మీద యాంకర్ గా సత్తా చాటుతోంది.

 Anchor Sreemukhi Marriage Rumors, Anchor Sreemukhi Marriage, Anchor Sreemukhi ,s-TeluguStop.com

తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కిస్తూ, అల్లరి తనంతో యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది యాంకర్ శ్రీముఖి.శ్రీముఖి మొదట్లో యాంకరింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సుమ బుల్లితెరలో సుమ ఏక ఛత్రాధిపత్యం నడుస్తోంది.

యాంకరింగ్ అంటే సుమ, సుమ అంటే యాంకరింగ్ అనేంతలా బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది.అప్పటివరకు యాంకరింగ్ అంటే సుమలా చేయడం అని మానసికంగా అలవాటు పడిన బుల్లితెర ప్రేక్షకులకు కొత్త తరహా యాంకరింగ్ ని శ్రీముఖి పరిచయం చేసిందనే చెప్పవచ్చు.

అయితే తాజాగా శ్రీముఖి పెళ్లికి సంబంధించి రకరకాల నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.తాజాగా అభిమానులతో నిర్వహించిన లైవ్ షోలో అభిమాని మీ పెళ్ళెప్పుడు అని అడిగిన ప్రశ్నకు శ్రీముఖి క్లారిటీ ఇచ్చినా మరల రకరకాల పుకార్లు మొదలవుతూనే ఉన్నాయి.

అయితే ముంబైకి చెందిన ఎప్పటినుండో తనకు పరిచయం ఉన్న స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తలపై ఇంకా శ్రీముఖి స్పందించలేదు.

మరి ఈ పుకార్లపై శ్రీముఖి స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube