నెటిజన్ కు ఫోన్ నంబర్ ఇచ్చిన శ్రీముఖి.. ఎవరిదంటే..?

బుల్లితెర యాంకర్లు, నటీనటులు లాక్ డౌన్ వల్ల టీవీ షోల షూటింగ్ లు ఆగిపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత కొన్ని నెలలుగా మళ్లీ వరుస షోలతో బిజీ అవుతున్న శ్రీముఖి తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల తో ముచ్చటించారు.

 Sreemukhi Gave Her Phone Number Due To Her Fans Request-TeluguStop.com

పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న టీవీ షోలు, ఈవెంట్లతో శ్రీముఖి బుల్లితెరపై సందడి చేయడంతో పాటు హవా కొనసాగిస్తున్నారు.

పటాస్, బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా శ్రీముఖి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

 Sreemukhi Gave Her Phone Number Due To Her Fans Request-నెటిజన్ కు ఫోన్ నంబర్ ఇచ్చిన శ్రీముఖి.. ఎవరిదంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ షో రన్నర్ గా నిలిచిన శ్రీముఖికి ఎక్కువ సంఖ్యలో కాకపోయినా పరవాలేదనిపించే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్, ట్విట్టర్ బ్యాన్ అవుతాయని అవి బ్యాన్ అయితే సెలబ్రిటీల పరిస్థితి ఏమిటని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఆ వార్త గురించి స్పందించిన శ్రీముఖి ఫేస్ బుక్, ట్విట్టర్ బ్యాన్ అయితే అభిమానులతో తాము మాట్లాడలేనని అన్నారు.

Telugu Calling Bell, Fans Request, Phone Number, Sreemukhi-Movie

ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ తనను ఏమైనా అడగాలని అనుకుంటే వెంటనే అడిగేయాలని ఆమె కోరారు.ఒక నెటిజన్ పెళ్లి ఎప్పుడని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని శ్రీముఖి పేర్కొన్నారు.శ్రీముఖితో మాట్లాడటం కోసం తనకు టోల్ ఫ్రీ నంబర్ కావాలని ఒక నెటిజన్ అడగగా శ్రీముఖి ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన నంబర్ ను ఇచ్చారు.

Telugu Calling Bell, Fans Request, Phone Number, Sreemukhi-Movie

నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి తెలివిగా సమాధానం ఇవ్వడం గమనార్హం.శ్రీముఖి నెటిజన్లకు ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించగా ఆ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానని శ్రీముఖి భావిస్తున్నారు.

#Fans #Phone Number #Sreemukhi #Bell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు