జానీ మాస్టర్ గుట్టు విప్పిన శ్రీముఖి.. అందరూ?  

వెండితెర పై స్టార్ హీరోలందరూ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు.కానీ తెరవెనుక ఆ డాన్సులను నేర్పించే కొరియోగ్రాఫర్ కష్టం కూడా ఉంటుంది.

TeluguStop.com - Sreemukhi Fun With Jani Master In Bomma Adhirindi Set

ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ టాలీవుడ్ లో ప్రముఖ హీరోలందరి చేత ఎంతో అద్భుతంగా స్టెప్పులు వేయించారు.తన స్టెప్పులతో ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

జానీ మాస్టర్ అటు వెండితెరపై కొరియోగ్రాఫర్ చేస్తూ, ఇటు బుల్లితెర పై బొమ్మ అదిరింది షోలో సందడి చేస్తున్నాడు.ఈ షో ద్వారా జానీ మాస్టర్ వేసే స్టెప్పులు, పంచులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

TeluguStop.com - జానీ మాస్టర్ గుట్టు విప్పిన శ్రీముఖి.. అందరూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలా షో ద్వారా చేసే కామెడీ అంతా మనకు తెలిసినదే.కానీ తెర వెనుక కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

తెరవెనుక జరిగే సంఘటనలు బహుశా ఎవరికీ తెలియవు.తాజాగా ఈ షోలో జానీ మాస్టర్, సాకేత్, శ్రీముఖి వీరు ముగ్గురు కలిసి చేసిన అల్లరి పనుల వీడియోను శ్రీముఖి షేర్ చేశారు.

బొమ్మ అదిరింది షో షూటింగ్ జరుగుతుండగా వీరు చేసిన అల్లరికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో సరదాగా జానీ మాస్టర్ ని శ్రీముఖి ఒక వింత ప్రశ్న అడిగింది.

జానీ మాస్టర్ మీరు ఇంస్టాగ్రామ్ లో ఎందుకు యాక్టివ్ గా ఉండరు? అనే ప్రశ్నను వేశారు.జానీ మాస్టర్ శ్రీముఖికి సమాధానం చెబుతూ ఉండగా ఇంతలో సాకేత్ కలగజేసుకుని జానీ మాస్టర్ బయట ఎంతో బిజీగా ఉండటంవల్ల ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండరంటూ మరొక అర్థం వచ్చేలా మాట్లాడారు.

అయితే సాకేత్ చెప్పిన సమాధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి జానీ మాస్టర్ ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో శ్రీముఖి కలుగజేసుకుని ఎన్ని స్టోరీలు చెబుతారో చెప్పండి మాస్టర్ అంటూ జానీ మాస్టర్ గుట్టు రట్టు చేసింది.అయితే ప్రస్తుతం వీరి అల్లరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#Jonny Master #Nagababu #Sreemukhi #BommaAdirindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sreemukhi Fun With Jani Master In Bomma Adhirindi Set Related Telugu News,Photos/Pics,Images..