ఓటిటిలో విడుదల అవుతున్నశ్రీముఖి సినిమా..?

యాంకర్ శ్రీముఖి.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Sreemukhi Film Its Time To Party Releasing In Ott Platform-TeluguStop.com

బుల్లితెరపై అదుర్స్ అంటూ అడుగుపెట్టిన శ్రీముఖి పటాకా పేలినట్టు పటాస్ షో తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయి తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నో షోస్ కు హోస్ట్ గా వ్యవహరించి తనకంటూ ఓ సొంత గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి.

అలాంటి శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బిగ్ బాస్ కి వెళ్లి ఎంతో అద్భుతంగా ఆట ఆడింది.కానీ కొన్నీ ఓట్ల తేడాతో శ్రీముఖి రన్నర్ గా మిగిలిపోయింది.

 Sreemukhi Film Its Time To Party Releasing In Ott Platform-ఓటిటిలో విడుదల అవుతున్నశ్రీముఖి సినిమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ లో రన్నర్ అయినా అభిమానుల గుండెల్లో మాత్రం శ్రీముఖి విన్నర్ అయ్యింది అనుకోండి అది వేరే విషయం.అందుకే శ్రీముఖికి వెంటనే కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది.

అలానే సినిమా కూడా తీసింది.ఆ సినిమా పేరే ”ఇట్స్ టైమ్ టూ పార్టీ”.

ఈ సినిమా లాక్ డౌన్ ముందే పూర్తయిన కూడా లాక్ డౌన్ కాకుండా వాయిదా పడింది.అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటిటి ద్వారా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

శ్రీముఖి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.ఈ సినిమా సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిందని.శ్రీముఖి ఈ సినిమాలో గతంలో ఎప్పుడు కనిపించని విధంగా కనిపించనున్నట్టు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై పలు షోస్ తో బిజీ బిజీగా ఉంటుంది.జెమినీ టీవీ నుంచి స్టార్ మా వరకు అన్ని ఛానెల్స్ లో శ్రీముఖి ఎంతో బిజీగా గడుపుతుంది.

#OTT Platm #Time #Prime #Sreemukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు