ఆ హీరోకు ఐ లవ్ యు చెప్పిన యాంకర్ విష్ణుప్రియ?  

Sreemukhi Comments about Navdeep Vishnupriya Relationship, Sreemukhi , Cash program, Anchir Vishnu priya, Hero navdeep, netizens, Suma, Dinners - Telugu Anchir Vishnu Priya, Cash Program, Hero Navdeep, Netizens, Pove Pora, Sreemukhi, Sreemukhi Comments About Navdeep Vishnupriya Relationship, Suma, Vihsnupriya Dinner

మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి విష్ణుప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియకు సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో మంచి పేరు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Sreemukhi Comments About Navadeep Vishnupriya Relationship

ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ యాంకర్ ఫోటోషూట్స్ తో అభిమానులకు మరింత చేరువవుతోంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో షో, ఇతర విషయాలకు సంబంధించిన విశేషాలను విష్ణుప్రియ పంచుకుంటుంది.

మరో బుల్లితెర యాంకర్ శ్రీముఖి విష్ణుప్రియకు బెస్ట్ ఫ్రెండ్.తాజాగా విష్ణుప్రియ, శ్రీముఖి యాంకర్ సుమ హోస్ట్ చేసే క్యాష్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు.ఈ షో ద్వారా శ్రీముఖి, విష్ణుప్రియ గురించి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.షోలో శ్రీముఖి రెండేళ్ల తరువాత యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకొని ఆనందంగా గడుపుతానని చెప్పగా విష్ణుప్రియ తన మనస్సులోని మాటను బయటపెట్టింది.

TeluguStop.com - ఆ హీరోకు ఐ లవ్ యు చెప్పిన యాంకర్ విష్ణుప్రియ-Gossips-Telugu Tollywood Photo Image

గతంలో అనేక సందర్భాల్లో విష్ణుప్రియ తనకు హీరో నవదీప్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో నవదీప్, రానాలలో ఒకరితో యాంకరింగ్ చేయమంటే ఎవరితో చేస్తావని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసింది.

వెంటనే విష్ణుప్రియ గట్టిగా తాను నవదీప్ తోనే యాంకరింగ్ చేస్తానని చెప్పడంతో పాటు నవదీప్ ఐ లవ్ యు అని చెప్పడంతో షోలో పాల్గొన్న వాళ్లతో పాటు యాంకర్ సుమ సైతం అవాక్కైంది.

ఇంతలో శ్రీముఖి కలుగజేసుకుని విష్ణుప్రియ నవదీప్ డిన్నర్లకు వెళ్లే వాళ్లని మరో సీక్రెట్ ను బయటపెట్టింది.

బులితెర జోడీల్లో ఈ మధ్య కాలంలో రవి శ్రీముఖి, రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి జోడీల గురించి నెటిజన్ల మధ్య చర్చ జరగగా శ్రీముఖి కామెంట్లతో విష్ణుప్రియ, నవదీప్ మధ్య ఏదో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.వెంటనే సుమ డిన్నర్ లో ఏమున్నాయని అడిగి టాపిక్ ను డైవర్ట్ చేయడం గమనార్హం.

#AnchirVishnu #Pove Pora #Cash Program #Netizens #Hero Navdeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sreemukhi Comments About Navadeep Vishnupriya Relationship Related Telugu News,Photos/Pics,Images..