శ్రీముఖి ‘బతుకు బలైపోయిన బండి’

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి వారు అక్కడ లాక్‌ అయినా కూడా ఇండస్ట్రీకి చెందిన వారు కొందరు క్రియేటివిటీతో ఎక్కడి వారు అక్కడే ఉండి జనాల్లో చైతన్యం తెచ్చేందుకు కామెడీ పండిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మొదట బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ సౌత్‌ స్టార్స్‌ ఇంకా హిందీ స్టార్స్‌తో కలిసి ఫ్యామిలీ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను చేసిన విషయం తెల్సిందే.

 Bathuku Balaipoyina Bandi ,highlight Comedy, Sreemukhi ,vishnupriya , Mukku Avin-TeluguStop.com

షార్ట్‌ ఫిల్మ్‌కు మంచి ఆధరణ లభించింది.ఎక్కడి వారు అక్కడే ఉండి ఆ ఫిల్మ్‌ చేశారు.

ఆ తర్వాత సౌత్‌ ఇండియా టీవీ ఆర్టిస్టు వారు కూడా ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు.తాజాగా శ్రీముఖి ఒక ఫన్నీ వీడియోను చేసి అందరిని నవ్విస్తోంది.
ఒక ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే బతకు జట్కాబండి కార్యక్రమానికి పేరడీగా బతుకు బలైపోయిన బండి అంటూ ఒక కామెడీ స్కిట్‌ను చేసింది.ఇందులో శ్రీముఖి కాపురాలు నిలబెట్టే పెద్దమనిషిగా కనిపించగా జబర్దస్త్‌ ముక్కు అవినాష్‌ ఇంకా యాంకర్‌ విష్ణు ప్రియలు భార్య భర్తలుగా కనిపించారు.

వీరి ముగ్గురు కూడా ఎవరి ఇంట్లో వారు ఉండి దీన్ని చేశారు.ఎవరికి వారు తమ ఫోన్‌లలో రికార్డు చేసి ఆ తర్వాత దీన్ని ఎడిట్‌ చేయించారు.

ప్రస్తుతం శ్రీముఖి వెబ్‌ ఛానెల్‌లో ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.భార్య భర్తల మద్య ప్రస్తుతం జరుగుతున్న గొడవలను చాలా ఫన్నీగా చూపించిన శ్రీముఖి అండ్‌ టీంకు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి వీడియోలను శ్రీముఖి అండ్‌ టీం మళ్లీ మళ్లీ మరిన్ని చేయాలంటూ నెటిజన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జబర్దస్త్‌ స్కిట్స్‌ లేవు, సీరియల్స్‌ లేవు.

ఏమీ లేకపోవడంతో అంతా చప్పగా పరిస్థితి కొనసాగుతుంది.అందుకే శ్రీముఖి స్కిట్‌ వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube