జైలుకెళ్ళిన పెళ్లి సందడి హీరోయిన్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

రాఘవేంద్రరావు దర్శకత్వంలో గత పాతిక సంవత్సరాల క్రితం శ్రీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం పెళ్లి సందడి. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

 Sreeleela Launch Mandi Restaurant Deisgned Prison Chaitanyapuri Details, Sri Le-TeluguStop.com

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇక ఇదే పేరుతో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కన్నడ బ్యూటీ శ్రీలీలా రోణంకి దర్శకత్వంలో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

మొదటి చిత్రంతోనే శ్రీలీలా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత నటి శ్రీలీలాకి ఎన్నో అవకాశాలు వచ్చాయి.మొదటి సినిమాతోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ నటి జైలుకు వెళ్లడంతో అందరూ ఎంతో షాక్ అయ్యారు.ఈ ముద్దుగుమ్మ జైలుకు వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా.

జైలుకు వెళ్లడం అంటే నిజంగానే జైలుకు వెళ్లడం కాదండోయ్.ఈమె అచ్చం జైలును తలపించేలా ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ ను ప్రారంభించడానికి వెళ్ళింది.

ఈ క్రమంలోనే ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Chaitanyapuri, Raghavendra Rao, Hotel, Jail Restaurant, Pellisandadi, Roh

ప్రస్తుత కాలంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కోసం ఎన్నో రెస్టారెంట్ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇలా స్టైల్ రెస్టారెంట్ అంటూ ఆకాశంలో భోజనాలు చేయడం, జైల్ రెస్టారెంట్ అంటూ జైలు వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటికే ఇలా ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో ఎన్నో రెస్టారెంట్లు కస్టమర్లను ఆకట్టుకోగా తాజాగా చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో అచ్చం జైలును తలపించేలా జైలు థీమ్ తో మరొక రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు.

ఈ రెస్టారెంట్ ప్రారంభించడానికి పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీలా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Telugu Chaitanyapuri, Raghavendra Rao, Hotel, Jail Restaurant, Pellisandadi, Roh

ఆదివారం ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ను ప్రారంభించారు.అచ్చం ఈ రెస్టారెంట్ జైలు గదులను పోలి ఉండటమే కాకుండా అక్కడ అ పనిచేసే సర్వర్లు కూడా అచ్చం ఖైదీల దుస్తులతో ఉండడం గమనార్హం.ఈ రెస్టారెంట్ ప్రారంభించిన అనంతరం శ్రీలీలా ఒక గదిలో ఆ రెస్టారెంట్ లో లభించే ఆహార పదార్థాల రుచి చూశారు.

ప్రస్తుతం ఈ రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Chaitanyapuri, Raghavendra Rao, Hotel, Jail Restaurant, Pellisandadi, Roh

ఇక ఈ ఫోటోలు చూస్తుంటే ఆ హోటల్ కి వెళ్తే నిజంగానే జైలుకు వెళ్లిన అనుభూతి కలిగేలా ఉంది.రెస్టారెంట్ గోడలు, సెల్, అక్కడ పనిచేసే సర్వర్లు అచ్చం జైలు వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు.ఏది ఏమైనా కస్టమర్లను ఆకట్టుకోవడానికి కోసం నిర్వాహకులు ఈ విధమైనటువంటి వినూత్న ఆలోచనలు చేస్తూ సరికొత్త విధానంలో రెస్టారెంట్లను నిర్వహిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ రెస్టారెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూస్తే మాత్రం మీరు కూడా ఇలాంటి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయాలని భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube