ఆ సినిమా కోసం 45 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం.. అసలు విషయం చెప్పిన నరేష్

శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో శ్రీకారం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కరోనా, జాతిరత్నాలు ఎఫెక్ట్ కారణంగా సినిమా డిజాస్టర్ అయ్యింది.

 Sreekaram Team Cultivated 45 Acres Of Land For The Film, Tollywood, Sharwanand,-TeluguStop.com

అయితే కంటెంట్ మీద నమ్మకంతో 14 రీల్స్ ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టారు.అయితే పెట్టిన పెట్టుబడి కూడా సినిమాకి రాలేదు.

థియేటర్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఒటీటీలో మాత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.డిజిటల్ ప్రేక్షకులని మెప్పిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో సాఫ్ట్ వేర్ జాబు వదిలేసి సొంతూరు వచ్చేసి ఉమ్మడి వ్యవసాయం చేస్తాడు.రియల్ లైఫ్ స్టొరీని బేస్ చేసుకొని ఈ కథని కిషోర్ తెరపై ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రియాలిటీకోసం అలాగే వ్యవసాయంలో ఉండే కష్టం తెలుసుకోవడం కోసం చిత్ర యూనిట్ నిజంగానే 45 ఎకరాలు సాగు భూమి కౌలుకి తీసుకొని వ్యవసాయం చేసింది.

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా మొదటిగా వేసిన పంట పోవడంతో మళ్ళీ రెండో పంట వేసి ఆ సాగు భూమిలోనే పొలానికి సంబందించిన సన్నివేశాలు అన్ని షూట్ చేశారు.

రియాలిటీ కోసం ఇలా చేశారు.అయితే ఆ సాగు భూమిని సీనియర్ హీరో నరేష్ దగ్గర నుంచి కౌలుకి తీసుకున్నట్లు తాజాగా ఆయన రివీల్ చేశారు.తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 45 ఎకరాలు శ్రీకారం షూటింగ్ కోసం నిజంగానే కౌలుకి తీసుకొని వ్యవసాయం చేశారని చెప్పుకొచ్చాడు.అలాంటి మంచి సినిమాలో తాను కూడా భాగం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube