ఓటిటీ లోకి రాబోతున్న 'శ్రీకారం'.. రిలీజ్ డేట్ ఫిక్స్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో యువ కథానాయకుడు శర్వానంద్ ఒకరు.ఈయన చాలా కస్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు.

 Sreekaram Movie Release Ott Platform-TeluguStop.com

తాజాగా ఈయన శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా మార్చి 11 న విడుదలైంది.

ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అంతేకాదు పలువురు ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు అందించారు.

 Sreekaram Movie Release Ott Platform-ఓటిటీ లోకి రాబోతున్న శ్రీకారం’.. రిలీజ్ డేట్ ఫిక్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను డైరెక్టర్ కిషోర్ తెరకెక్కించాడు.ఇది ఆధునిక వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కించాడు.ఈ సినిమా రైతుల కష్టాల గురించి వారు పడే బాదల గురించి చూపించారు.సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయాలో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేసారు.

ఈ సినిమాలో డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Telugu Priyanka Arul Mohan, Sharwanand, Sreekaram, Sreekaram Movie Release Ott Platform, Sun Nxt-Movie

ఈ సినిమాలో శర్వానంద్ కు జంటగా ప్రియా అరుళ్ మోహన్ నటించింది.సాయి కుమార్, మురళీ శర్మ, రావు రమేష్, ఆమని, నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్ల పరంగా అంత రాణించలేక పోయింది.

ఎందుకంటే శ్రీకారం సినిమా తో పాటు జాతి రత్నాలు సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

జాతి రత్నాలు కలెక్షన్లు కుమ్మేయడంతో శ్రీకారం సినిమా రేసులో వెనుకబడి పోయింది.

అయితే ఈ సినిమా మిస్ అయినా వారు ఇప్పుడు ఓటిటిలో చూడవచ్చు.ఏప్రిల్ 16 నుండి అంటే రేపటి నుండి శ్రీకారం సినిమా ఓటిటిలో రాబోతుంది.

సన్ నెక్స్ట్ యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.కొన్ని సినిమాలు థియేటర్స్ లో సత్తా చాటలేక పోయినా స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

మరి చూడాలి ఈ సినిమా ఎంత ఆకట్టుకుంటుందో.

#SreekaramMovie #Sreekaram #Sharwanand #Sun Nxt #PriyankaArul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు