శ్రీకారం తొలిరోజు వసూళ్లు.. పండగ బాగానే కలిసొచ్చిందిగా!

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మహాశివరాత్రి కానుకగా నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.

 Sreekaram First Day Collections, Sreekaram, Sharwanand, Sreekaram Collections, P-TeluguStop.com

కిషోర్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ సినిమాను పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడం, ఈ సినిమా ప్రమోషన్స్‌కు స్టార్స్ కలిసి రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపించారు.ముఖ్యంగా మార్నింగ్ షోలు వెలవెలబోయిన ఈ సినిమా థియేటర్ల వద్ద మ్యాట్నీ షో నుండి జనాల రద్దీ బాగానే కనిపించింది.దీంతో ఈ సినిమా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.07 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టింది.సెలవు దినం కావడం, పోటీలో మరో సినిమా ఉన్నా కూడా ఈ సినిమాను చూసేందుకే జనం ఆసక్తిని చూపించినట్లు ఈ చిత్ర వసూళ్లు చూస్తే తెలుస్తోంది.

శర్వానంద్ యాక్టింగ్‌కు అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ అందం, అభినయం తోడవడంతో ఈ సినిమా వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు సాధించిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.08 కోట్లు

సీడెడ్ – 72 లక్షలు

ఉత్తరాంధ్ర – 54 లక్షలు

తూర్పు – 44 లక్షలు

పశ్చిమ – 27 లక్షలు

కృష్ణ – 23.10 లక్షలు

గుంటూరు – 65 లక్షలు

నెల్లూరు – 14 లక్షలు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.4.07 కోట్లు షేర్

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 10 లక్షలు

ఓవర్సీస్ – 12 లక్షలు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – రూ.4.29కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube