శర్వానంద్ సినిమాకి టాక్ బాగున్న డిజాస్టర్ తప్పలేదు... క్లోజింగ్ కలెక్షన్స్

ఒక్కోసారి కథ, కథనం బాగున్నా కూడా సినిమాలు హిట్ కావు.అసలు ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదో అనే విషయం కూడా దర్శక, నిర్మాతలకి అర్ధం కాదు.

 Sreekaram Ends Up As A Disaster At The Box Office, Sharwanand, Tollywwood, 14 Re-TeluguStop.com

టాలీవుడ్ లో ఈ తరహాలో రిజల్ట్ చాలా సినిమాలకి వచ్చింది.ఖలేజా సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనే విషయం ఇప్పటికి ఎవరికీ అర్ధం కాదు.

అలాగే కొన్ని సినిమాలు ఏ కారణంగా హిట్ అయ్యాయో అనే విషయం కూడా అర్ధం కాదు.సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు చాలా బాగుంది అన్నవి తరువాత కలెక్షన్ లేక డీలా పడి ఫ్లాప్ అయిపోతాయి.

తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కి రిలీజ్ అయిన శ్రీకారం సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది.సినిమా చూసిన ప్రేక్షకులలో మెజారిటీ వర్గం చాలా బాగుంది.

అద్బుతమైన కథ, కథనం సినిమాలో ఉన్నాయి అని బయటకొచ్చి కామెంట్స్ చేసినవారే.అలాగే కొంత మంది మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు కూడా పెట్టారు.

సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం శ్రీకారం సినిమా చూసి అద్బుతంగా ఉందని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ట్వీట్ చేశారు.

అయితే ప్రేక్షకుల పాజిటివ్ రివ్యూలు గాని, సెలబ్రిటీ ప్రశంసలు కాని శ్రీకారం సినిమాని ఏ హిట్ చేయలేకపోయాయి.

సినిమాకి వచ్చిన కలెక్షన్ చూస్తేనే శర్వానంద్ కి శ్రీకారం సినిమా ద్వారా ఎలాంటి ఫలితం వచ్చింది అనేది అర్ధమవుతుంది.ఈ సినిమాని ప్రతి నటుడు ప్రాణం పెట్టి చేశారు.

నిర్మాతలు ఇష్టంతో తీశారు.కాని సినిమాకి పెట్టిన పెట్టుబడి మాత్రం రాలేదు.ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ చూసుకుంటే చిత్రానికి జరిగిన బిజినెస్ 17.1 కోట్లు.అందులో వచ్చింది కేవలం 9.64 కోట్లు.అంటే బయ్యర్లకు దాదాపు 7.86 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది శ్రీకారం.మంచి కాన్సెప్టుతో వచ్చినా కూడా జాతి రత్నాలు సినిమా ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అవ్వడంతో, శ్రీకారం సినిమా వైపు జనం చూడలేదు.దాంతో శర్వానంద్‌కు వరుసగా 4వ డిజాస్టర్ తప్పలేదు.

మొత్తానికి శర్వానంద్ కి వరుసగా వచ్చిన నాలుగు ఫ్లాప్ సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ కి వచ్చేసరికి డీలా పడ్డవే కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube