యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి.బరిలో జాతిరత్నాలు వంటి క్రేజీ చిత్రం ఉన్నా కూడా ‘శ్రీకారం’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఇక రిలీజ్ రోజున ఈ సినిమాను మంచి టాక్ లభించినా కూడా అది వీకెండ్ వరకే ఉపయోగపడింది.వీక్ డేస్‌లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా చాలా బలహీనపడింది.
దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు తక్కువగా నమోదయ్యయి.జాతిరత్నాలు చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో జనం ఆ సినిమాను చూసేందుకే ఆసక్తిని చూపారు.
దీంతో శ్రీకారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.ఇక ఏడు రోజులు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.9.13 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.ఈ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూసిన శర్వానంద్‌కు మరోసారి నిరాశే మిగిలింది.
బి.
కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు.ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
కాగా ఏరియాలవారీగా శ్రీకారం 7 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 2.73 కోట్లు
సీడెడ్ – 1.57 కోట్లు
వైజాగ్ – 1.16 కోట్లు
తూర్పు – 72 లక్షలు
పశ్చిమ – 49 లక్షలు
కృష్ణా – 49 లక్షలు
గుంటూరు – 96 లక్షలు
నెల్లూరు – 32 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.8.44 కోట్లు షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 27 లక్షలు
ఓవర్సీస్ – 42 లక్షలు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.9.13 కోట్లు
.